Minister Savitha: మద్యం తాగి ఆటోనడుపుతున్న ఓ డ్రైవర్‌పై ఫైరయ్యారు మంత్రి సవిత. అతనితోపాటు ప్యాసింజర్స్ లైఫ్‌ను రిస్క్‌లో పెడతారా అని శ్రీసత్యాసాయి జిల్లా పెనుగొండకు చెందిన ఆటోడ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. వెంటనే ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు సవిత. ఆ డ్రైవర్ అడ్డదిడ్డంగా ఆటో నడుపుతుండడాన్ని.. అటుగా వెళుతున్న మంత్రి సవిత గమనించారు. అనుమానం వచ్చి ప్రశ్నించగా.. ఆటో డ్రైవర్ మద్యం తాగినట్లు తెలుసుకున్నారు మంత్రి. మంత్రి సవిత ఆదేశాలతో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.