Google Bug bounty| గూగుల్ ఇటీవలే ఒక కొత్త బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఎథికల్ హ్యాకింగ్ చేసేవారు ఈ ప్రొగ్రామ్ లో పాల్గొని గూగుల్ యాప్స్, ప్లాట్‌ఫామ్స్ లో కోడింగ్ ఎర్రర్, బగ్స్ వంటి లోపాలు కనిపెట్టాలి. ఈ ప్రోగ్రామ్ పూర్తిగా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించబడింది. AIలో సెక్యూరిటీ రిస్క్‌లను గుర్తించడమే ఈ ప్రొగ్రామ్ టార్గెట్.
ఇందులో విజయవంతమైన హ్యకింగ్ ప్రొఫెషనల్స్‌కు భారీగా ఆర్థిక బహుమతులు ప్రకటించింది గూగుల్. ఏఐ ఉత్పత్తులను ఉపయోగించేవారి ప్రైవెసీ, డేటా భద్రత మెరుగుపరచడానికి గూగుల్ ఈ బగ్ బౌంటీ నిర్వహించి తన నిబద్ధతను తెలియజేసింది.
ఇలాంటి ప్రొగ్రామ్ లు ఇప్పటికే ఆపిల్ కంపెనీ తరుచూ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే గూగుల్ బగ్ బౌంటీ ప్రొగ్రామ్ లో బహుమతి విలువ ఎక్కువ. క్లిష్టమైన సెక్యూరిటీ రిస్క్ లను గుర్తిస్తే.. బహుమతి విలువ $30,000 (అంటే సుమారు రూ.26.63 లక్షలు). గూగుల్ సెర్చ్ టూల్ వంటి ప్రధాన ప్రొడక్ట్స్ కు ఎక్కువ రివార్డ్‌లు వర్తిస్తాయి. జెమినీ AI యాప్‌లు, ప్రయోగాత్మక AI అసిస్టెంట్, జూల్స్, అలాగే ప్రయోగాత్మక నోట్-టేకింగ్ టూల్, నోట్‌బుక్ LM కూడా ఇందులో ఉన్నాయి.
జీమెయిల్, గూగుల్ డ్రైవ్ సేవలు, జెమినీ యాప్ వంటి ప్రొడక్ట్స్ ఈ బౌంటీ ప్రోగ్రామ్ కిందకు వస్తాయి.
అదనంగా.. గూగుల్ ఈ భద్రతా అన్వేషణలకు బోనస్ చెల్లింపులు కూడా ఇస్తోంది. ప్రత్యేకంగా దాని AI టూల్స్ సూట్‌పై సమగ్రమైన సెక్యూరిటీ, డేటా రిస్క్ రిపోర్ట్ ఇచ్చే హ్యాకింగ్ నిపుణుల కోసం గూగుల్ చూస్తోంది. ఉదాహరణకు యాక్సెస్ లేకుండానే జిమెయిల్ ను మార్చేసే కమాండ్, గూగుల్ హోమ్ స్మార్ట్ డోర్ అన్‌లాక్ చేసే కమాండ్ లు ఎవరైనా చేయగలిగితే వారికి ప్రత్యేక బహుమతులు ఉంటాయి. అలాగే అనధారికంగా డేటా లీక్ అయ్యే అవకాశాలు ఉంటే వాటిని తెలియజేయాలి.
ప్రతి AI సమస్య బగ్ బౌంటీ ప్రొగ్రామ్ కు అర్హత ఉండదు. AI హాల్యుసినేషన్‌లు, భద్రతా బగ్‌లుగా ప్రారంభంలోనే పరిగణించబడవు. కాపీరైట్ కలిగిన కంటెంట్ లేదా ద్వేష ప్రసంగం కలిగిన కంటెంట్ సమస్యలు లెక్కించబడవు. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కేవలం భద్రతా సంబంధిన రిస్క్ లకు మాత్రమే ఫోకస్ చేస్తుంది.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!