Hyderabad Drug Bust: గ్రేటర్ హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో పాటు.. లా అండ్ ఆర్డర్ పోలీసులు నిత్యం దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
వీటికి అలవాటైన యువతకు సులువుగా ఇవి దొరుకుతుండడంతో.. వారు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఒరిస్సా నుంచి బస్సులో వస్తున్న 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని అంచనా.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ మరోసారి గంజాయి అక్రమ రవాణాపై కఠినమైన చర్యలు తీసుకుంది. ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్ దిశగా వస్తున్న ఓ వోల్వో బస్సులో భారీ మోతాదులో గంజాయిని తరలిస్తుండగా.. పోలీసులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 20.6 కేజీల గంజాయి స్వాధీనం కాగా, ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన నాభి నాయక్ అలియాస్ హరిను అరెస్ట్ చేశారు.
గతంలో భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో ఎస్ఓటి పోలీసులకు పట్టుబడిన నాభిన్ నాయక్.. అలియాస్ హరి ఒరిస్సా నుంచి.. నాలుగు బస్తాల్లో 20 కేజీలకు పైగా గంజాయిని తీసుకువస్తూ ఉన్నాడనే సమాచారం అందుకున్న.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏఈఎస్ జీవన్ కిరణ్ సిఐలు, సుభాష్ చందర్ ఇతర సిబ్బందిని కలిసి రామోజీ ఫిలిం సిటీ వద్ద బస్సును నిలిపి తనిఖీలు నిర్వహించి.. అందులో ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: విషాదం.. లిఫ్ట్ కూలి నలుగురు కార్మికులు మృతి
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుండి మొబైల్ ఫోన్, బస్ టికెట్, ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడి వెనుక ఉన్నపెద్ద రవాణా నెట్వర్క్‌ను గుర్తించేందుకు.. పోలీసులు ఆరా తీస్తున్నారు.