War 2 OTT: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో వార్ 2(War 2) సినిమాలో నటించారు. యష్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ అందుకోలేకపోయింది. ఇలా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) భారీ ధరలకు కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి నెట్ ఫ్లిక్స్ అధికారక ప్రకటన వెల్లడించారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలలో అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలియజేశారు.
ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అధికారక ప్రకటన రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక థియేటర్లలో సుమారు 300 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకులను నిరాశపరిచింది. థియేటర్లలో అనుకున్న విధంగా సక్సెస్ అందుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో అయిన మంచి సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా విషయంలో తారక్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ను తమ కార్టెల్ లో భాగం చేసుకోవాలని కలి అనే విలన్ పథకం రచిస్తారు. దీంతో ఒక టాస్క్ పేరు చెప్పి కబీర్ చేత తన ఎంతో ఆరాధించే సునీల్ లూత్రాను చంపేలా ప్లాన్ చేస్తారు. ఈ టాస్క్ లో భాగంగా కబీర్ పట్టుకోవడం కోసం రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ ( అనిల్ కపూర్), ఇండియన్ సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) సారథ్యంలో ఒక టీం రంగంలోకి దిగుతుంది. ఇక ఈ టీంకు లూత్రా కుమార్తె కావ్య (Kiara Advani) వింగ్ కమాండర్ గా వ్యవహరిస్తుంటారు. అసలు కబీర్ ఎందుకు ఇలా దేశద్రోహిగా మారిపోయాడు? స్పెషల్ టీం కబీర్ ను పట్టుకుంటారా? అనేది తెలియాలి అంటే మనం సినిమా చూడాల్సిందే.
Also Read: Kantara Chapter1: 400 కోట్లక్లబ్ లోకి కాంతార1 .. ఆగని కలెక్షన్ల సునామీ!