Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో గత కొంతకాలంగా వరుస సీజన్లను పూర్తి చేసుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. అంతేకాదు ఈ షోకి బుల్లితెర ఆడియన్స్ మాత్రమే కాదు అటు ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. భిన్న విభిన్నమైన టాస్కులతో హౌస్ లో ఎమోషన్స్, కామెడీ, ఫన్, లవ్ ట్రాక్ ఇలా అన్నీ కలగలిసి ఒకే చోట లభించేసరికి ప్రతి ఒక్కరు దీనిపై ఆసక్తి కనబరిస్తున్నారు. అలా తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం 9వ సీజన్ కూడా ప్రారంభం అయింది.
మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో 6 మంది కామనర్స్ లో ముగ్గురు కామనర్స్ ఎలిమినేట్ అవ్వగా.. తొమ్మిది మంది సెలబ్రిటీలలో ఒక సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు. అలా నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఐదవ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ జరగాల్సి ఉండగా.. నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి కంటెస్టెంట్స్ మధ్య విభిన్నమైన టాస్కులు నిర్వహిస్తూ.. ఆడియన్స్ కి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇకపోతే తాజాగా 31వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. మరి ఆ ప్రోమోలో ఏముంది? ఎవరు గెలిచారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మ్యాచ్ ఇట్ విన్ ఇట్.. పోటీదారులు చేయవలసిందిగా ప్రతి జట్టులోని ఒకరు యాక్టివ్ రూమ్ లో ఉన్న మ్యూజియంకి వెళ్లి అక్కడ రెడ్ క్లాత్ మీద ఉన్న పెడస్ట్రల్ పై ఉన్న వస్తువును గమనించి.. లివింగ్ ఏరియాకి వచ్చి తాము చూసిన బొమ్మను డ్రాయింగ్ బోర్డుపై గీయాలి. మిగిలిన వాళ్ళు తమ పార్ట్నర్ ఏ బొమ్మైతే గీసారో దానిని గుర్తించి మ్యూజియం నుండి తీసుకురావాలి అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్బాస్. ఇక తర్వాత ఎవరికి వారు తమ పార్ట్నర్స్ గీసిన బొమ్మలను తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. చివరిగా సుమన్ శెట్టి గీసిన బొమ్మను.. శ్రీజ రియల్ బొమ్మను తీసుకొచ్చి ఆ టాస్క్ విన్ అయిపోయారు.
ALSO READ:Manchu Family : మా పరువు తీశారు.. యూనివర్సిటీ సీజ్‌పై మంచు ఫ్యామిలీ రియాక్షన్
బిగ్ బాస్ మాట్లాడుతూ.. సుమన్ మీరు గీసింది అచ్చం అలాగే ఉంది అంటూ ఆట పట్టించారు. ఇంకా ఇమ్మానియేల్ తనదైన శైలిలో కామెడీ చేస్తూ సుమన్ శెట్టి ప్రభంజనం.. కిరీటాన్ని ధ్యేయంగా పెట్టుకొని ఫస్ట్ రౌండ్ లోనే కిరీటాన్ని గీశాడు. రెండవ రౌండ్లో పుట్టగొడుగులు గీశారు అంటూ ఆట పట్టిస్తూ తన డైలాగ్స్ తో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.