BigTV English

Bengaluru News: ఒకప్పుడు బార్బర్.. ఇవాళ లగ్జరీ కార్లకు యజమాని, రమేశ్‌బాబు ఆలోచనే పెట్టుబడి

Bengaluru News: ఒకప్పుడు బార్బర్.. ఇవాళ లగ్జరీ కార్లకు యజమాని, రమేశ్‌బాబు ఆలోచనే పెట్టుబడి

Bengaluru News: చాలా మంది రాజకీయ నాయకులు చెబుతారు.. నాయకుడు అనేవారు దిగువ స్థాయి రావాలని అంటుంటారు. వ్యాపారవేత్తలూ చాలామంది ఆ స్థాయి నుంచి వచ్చినవారు ఉన్నారు. అలాంటి వారిలో బెంగుళూరుకి చెందిన రమేశ్‌బాబు ఒకరు. ఆయన గురించి అప్పుడప్పుడు విన్న సందర్భాలు లేక పోలేదు. ఒకప్పుడు రోడ్డు పక్కన చిన్న బార్బర్ షాప్ నడుపుకునేవాడు. ఇవాళ 400 లగ్జరీ కార్లకు యజమాని. ఇటీవల మూడు కోట్ల పైచిలుకు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశాడు.


రమేష్‌బాబు ‘స్వయంకృషి’

కష్టాలకు కేరాఫ్ రమేష్‌బాబు ఫ్యామిలీ. చెప్పుకోవాలంటే ఆయగ నుంచి ఓ సినిమా కూడా తీయవచ్చు. ఆయన్ని దగ్గరుండి గమనించినవాళ్లకు చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’ సినిమా గుర్తుకొస్తుంది. రమేష్ చిన్నప్పుడు ఆయన తండ్రి బార్బర్‌గా పని చేసేవారు. బెంగుళూరు సిటీలోని రోడ్డు పక్కన చిన్న షాపు ఉండేది. రమేష్‌కు కేవలం ఏడేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. కుటుంబ భారమంతా తల్లిపై పడింది.


ఫ్యామిలీని పోషించడానికి ఇళ్లలో పని మనిషిగా మారింది. వేకువజామున నాలుగు గంటలకు రాత్రి 11 గంటల వరకు పని చేసేది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రమేశ్ మాత్రం చదువును ఆపలేదు. తల్లి కష్టాలను దగ్గరుండి చూసిన రమేష్, తనవంతు సాయం చేసేవాడు. తొలుత పేపర్లు బాయ్‌‌గా మారాడు. ఆ తర్వాత ఉదయాన్ని ఇంటింటికి పాలు అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్కూల్‌‌కు వెళ్లి చదువుకునేవాడు.

లగ్జరీ కార్లకు యజమాని నాటి బార్బర్

స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి కావడంతో రమేశ్ తండ్రి వృత్తిని ఎంచుకున్నాడు. రోడ్డు పక్కన కటింగ్ షాపును మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన ఆలోచనకు పదునుపెట్టాడు. ఆ తర్వాత అద్దెకు చిన్న షాప్ తీసుకుని సెలూన్‌గా, ఆపై ఫేమస్ స్టైలింగ్ అవుట్‌లెట్‌గా మార్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే సెలూన్ రమేష్ ఫ్యూచర్‌కు పునాది రాయి.

వీటి ద్వారా వచ్చిన డబ్బుతో పొదుపుతో 1993లో మారుతి ఓమ్ని వ్యాన్ కొన్నాడు. ఆ తర్వాత అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టాడు. 2004లో మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్‌ను కొనుగోలు చేశాడు. లగ్జరీ కార్ల రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ కొనుగోలు చేసిన కారు, ‘రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్’‌కు నాంది పలికింది. కొన్నేళ్లుగా తన కార్లను విస్తరించుకుంటూ పోయాడు.

ALSO READ: బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం.. తులం ఎంతో తెలుసా?

రోల్స్-రాయిస్ ఘోస్ట్, మర్సిడెజ్-మేబ్యాక్ S600, బీఎండబ్ల్యూ i7 వంటి దేశంలో అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన కార్లను చేర్చారు. ప్రస్తుతం మెర్సిడెస్-బెంజ్, BMW, జాగ్వార్, రోల్స్-రాయిస్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లను కలిగి ఉన్న 400 కంటే ఎక్కువ వాహనాలు కలిగివున్నాడు. భారతదేశ లగ్జరీ టాక్సీ విభాగంలో మార్గదర్శకుడిగా ఖ్యాతిని సంపాదించాడు రమేష్‌బాబు.

కార్పొరేట్ ప్రయాణం, ప్రత్యేక సందర్భాలు కోసం హై-ఎండ్ వాహనాలను అందిస్తున్నాడు. ఇటీవల రమేష్‌‌బాబు రూ. 3.2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేశాడు. రేంజ్ రోవర్ డెలివరీని కంపెనీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు.

Related News

Gold Rate Today: బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

Post Retirement Income: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. లక్ష ఆదాయం.. ఈ పొదుపు ప్రణాళిక ఫాలో అవ్వండి?

Malabar Gold & Diamonds: మలబార్ అద్భుతమైన ఆఫర్.. గోల్డ్ & డైమండ్స్‌ ఛార్జీలపై 30% తగ్గింపు, చలో ఇంకెందుకు ఆలస్యం

Digital Currency: ఇండియాలో డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీని నో ఛాన్స్, మంత్రి గోయల్ క్లారిటీ

EPFO Pension Hike: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. కనీస పెన్షన్ ​​రూ. 2,500 పెంచే ఛాన్స్

Gold Markets: దేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్లు.. ఇక్కడ వేలకొద్ది గోల్డ్ షాపులు, లక్షల కోట్ల వ్యాపారం

Today Gold Price: బిగ్ బ్రేకింగ్.. 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

Big Stories

×