మన దేశంలో నదుల మీద, సముద్రం పైనా (రామేశ్వరం) పరుగులు తీసే రైళ్లను చూసి ఉంటారు. కానీ, నదీ గర్భంలో దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా? ఈ రైలు చిరుతను మించిన వేగంతో దూసుకెళ్తుంది. ఇంతకీ ఈ రైలు ఎక్కడుంది? ఎంత దూరం నీటి లోపల ప్రయాణిస్తుంది? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నదీ గర్భంలో నడిచే మెట్రో రైలు కోల్ కతాలో ఉంది. హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగం ద్వారా ఈ రైలు దూసుకెళ్తుంది. ఈ టన్నెల్ హుగ్లీ నది తూర్పు ఒడ్డున ఉన్న ఎస్ప్లానేడ్ ను పశ్చిమ ఒడ్డున ఉన్న హౌరా మైదాన్ ను కలుపుతుంది. ఈ టన్నెల్ భూమి మట్టానికి దాదాపు 33 మీటర్ల దిగువన ఉంది. అంటే, సుమారు 11 అంతస్తుల భవనం ఎంత ఎత్తులో ఉంటుందో.. ఈ టన్నెల్ సముద్ర గర్భంలో అంత దిగువన ఉంటుంది. హౌరా నుంచి ఎస్ప్లానేడ్ వరకు మొత్తం 4.8 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ మార్గంలో సుమారు అర కిలో మీటరు నదీ గర్భంలో సొరంగ మార్గం ద్వారా మెట్రో ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని దాటడానికి దాదాపు ఒక నిమిషం పడుతుంది. ఈ సొరంగం నిర్మాణానికి గత 120 సంవత్సరాలుగా ప్రణాళికలు కొనసాగాయి.
హూగ్లీ నది కింద నిర్మించిన ఈ టన్నెల్ దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ సొరంగంగా గుర్తింపు తెచ్చుకుంది. దీని నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. పై నుంచి నీటి ఒత్తిడిని తట్టుకోగల, నిర్మాణ సమయంలో నీరు ప్రవేశించకుండా నిరోధించగల యంత్రాలను ఉపయోగించి దీనిని నిర్మించారు. దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో సొరంగాలు నిర్మించబడినప్పటికీ, దీనిని నీటి అడుగున నిర్మించాల్సి వచ్చింది. బయట వాడే TBMతో ఈ నిర్మాణం చేయడం కష్టం అయ్యింది. అందుకే నది అంతర్భాగంలో నిర్మించిన ఈ టన్నెల్ కోసం జర్మనీలో ప్రత్యేకమైన TBMను ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేక ఏంటంటే.. మట్టి తొలగించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏకకాలంలో మూసివేస్తుంది. టన్నెల్ తవ్వకం సమయంలో నీరు ప్రవేశించినప్పటికీ.. పూర్తయిన సొరంగం ఏమాత్రం దెబ్బతినదు. ఇక సొరంగంలోకి నీరు ఎప్పుడూ ప్రవేశించకుండా చూసుకోవడానికి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. మొదటిసారిగా, జాయింట్స్ లో హైడ్రోఫిలిక్ గాస్కెట్లను ఉపయోగించారు. ఇవి జలనిరోధకాలుగా వ్యవహరించాయి. నీటి అడుగున ఈ సొరంగం 520 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
Read Also: దేశంలో టాప్ 10 లాంగెస్ట్ వందేభారత్ రూట్లు ఇవే, ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉందంటే?
ఈ ప్రాజెక్ట్ కు 1971 మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది. కానీ, వెంటనే అనుమతులు రాలదు. ఢిల్లీ మెట్రో సక్సెస్ తర్వాత దీనికి 2008లో అనుమతి లభించింది. నీటి అడుగున సొరంగం 2025 నాటికి పూర్తయి అందుబాటులోకి వచ్చింది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్, మన దేశంలోనే ఉంది తెలుసా?