BigTV English

Bytepe Tech Subscription: ప్రతి ఏడాది ఓ కొత్త ఫోన్ మీ సొంతం! కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే?

Bytepe Tech Subscription: ప్రతి ఏడాది ఓ కొత్త ఫోన్ మీ సొంతం! కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే?

Bytepe Tech Subscription| భారతదేశంలో తొలిసారిగా టెక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ప్లాట్ ఫామ్ లాంచ్ అయింది. ప్రతి రోజు కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ విడుదలవుతుండగా.. తమ వద్ద అత్యాధునిక ఫీచర్లు గల ఫోన్ ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ప్రతీసారి కొనుగోలు చేయాలంటే అది జరగని పని. అయితే ఈ కోరికను తీర్చేందుకే బైట్‌పే లాంచ్ అయింది. ఇది మీ వద్ద పాత మోడల్ డివైస్‌లకు స్మార్ట్ రీప్లేస్‌మెంట్ అందిస్తుంది.


దీని ఫౌండర్ జయంత్ ఝా, ఫ్లిప్‌కార్ట్ మాజీ లీడర్. బైట్‌పే సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే చాలు మీకు కావాల్సిన మొబైల్ కొనుగోలు చేయకుండానే పొందగలరు. ఈ సర్వీస్ కస్టమర్స్‌పై ఆర్థిక ఒత్తిడి తొలగిస్తుంది. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు భారీ అప్‌ఫ్రంట్ కాస్ట్ లేకుండా పొందవచ్చు. ఇప్పుడు తాజాగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు కూడా బైట్ పే సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఈ కొత్త మోడల్స్‌ మీ సొంతమవుతాయి.

ఈ సబ్‌స్క్రిప్షన్ ఎలా పనిచేస్తుంది?

బైట్‌పే లో ఒక ఈజీ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఉంది. కేటలాగ్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌ను సెలెక్ట్ చేయండి. ఉదాహరణకు లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ డివైస్‌లు ఉన్నాయి. ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మంత్లీ కాస్ట్ EMI కంటే తక్కువే. పైగా ఎటువంటి రహస్య ఫీజులు లేవు. లాక్-ఇన్ పీరియడ్ లేదు. మీరు ఉపయోగించినంత మాత్రమే పే చేయండి, పాత ఫోన్లను కొత్త వాటితో సులభంగా అప్‌గ్రేడ్ చేయండి.


సర్వీస్ ఎలా పొందాలి?

డివైస్ పొందడం చాలా సింపుల్. మొదట, ఐఫోన్ 17 వంటి డివైస్‌ను సెలెక్ట్ చేయండి. తదుపరి, సూటబుల్ మంత్లీ పేమెంట్ ఎంచుకోండి. మీ క్రెడిట్ కార్డ్‌కు చార్జ్ చేయవచ్చు లేదా బైట్‌పే EMI ఆప్షన్ ఉపయోగించవచ్చు. డివైస్ మీ అడ్రస్‌కు డెలివరీ అవుతుంది. ఫోన్ వచ్చిన వెంటనే ఉపయోగించవచ్చు. నాన్-క్రెడిట్ కార్డ్ యూజర్స్‌కు స్పెషల్ EMI ఆప్షన్ కూడా ఉంది.

ఒక సంవత్సరం తర్వాత సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్స్

ఒక సంవత్సరం తర్వాత మూడు క్లియర్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్రాండ్ న్యూ డివైస్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. మీరు సంవత్సర కాలంగా ఉపయగిస్తున్న డివైస్‌ను రిటర్న్ చేయవచ్చు. లేదా, ఇన్‌స్టాల్‌మెంట్స్ కొనసాగించి ఓనర్‌షిప్ రీటైన్ చేయవచ్చు. ఈ సౌలభ్యం సబ్‌స్క్రిప్షన్ మెయిన్ అడ్వాంటేజ్. ప్రతి సంవత్సరం కొత్త ఫోన్‌ మీరు కొనుగోలు చేయకుండానే పొందవచ్చు. ఇలా చేస్తే డబ్బు భారీగా సేవ్ అవుతుంది.

డ్యామేజ్ ప్రొటెక్షన్

ప్రతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో పూర్తి డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంది. యాక్సిడెంటల్‌గా ఫోన్ డ్యామేజ్ అయితే రిపేర్ ఖర్చుల గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ప్రైస్‌లోనే ఇన్‌షూరెన్స్ కూడా కలిపే ఉంటుంది కాబట్టి ఏ టెన్షన్ ఉండదు.

అప్‌ఫ్రంట్ పర్చేజ్ ప్లాన్

బైట్‌పేలో ఆప్షనల్ పర్చేజ్ మోడల్ కూడా ఉంది. ఫోన్‌ను డైరెక్ట్‌గా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్‌లో కూడా వన్ ఇయర్ ఇన్‌షూరెన్స్ ఇన్‌క్లూడెడ్. అసూర్డ్ బైబ్యాక్ వాల్యూ 50% వరకు పొందవచ్చు. 12 లేదా 24 నెలల తర్వాత రికవర్ చేయవచ్చు. ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లా వర్క్ చేస్తుంది.

బైట్‌పే విజన్

టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే కంపెనీ విజన్. ప్రీమియం డివైస్‌లను వీలైనంత తక్కువ ఖర్చుకే ప్రజలకు అందించడం. ఈ తరహా సర్వీస్‌తో ప్రతి సంవత్సరం ఇప్పుడు దాదాపు అందరూ కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. లోన్ తీసుకోవడం కంటే డబ్బు ఆదా సేవ్ అవుతుంది. అప్‌ఫ్రంట్ కాస్ట్ లేకపోవడంతో ఆర్థికంగా బరువు ఉండదు. EMIల కంటే 50% వరకు ఖర్చు.

ఈ బైట్‌పే సర్వీస్ గేమ్-చేంజర్. ఐఫోన్ 17 (256GB) ₹82,900కి మంత్లీ ఫీజ్‌తో ఇప్పుడే పొందండి. ఐఫోన్స్ మాత్రమే కాదు.. గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ S25 లాంటి ప్రతి బ్రాండ్ లోని లక్షలు ఖరీదు చేసే ప్రీమియం ఫోన్లు కూడా బైట్‌పే అందిస్తోంది.

Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే

Related News

Google Bug bounty: హ్యాకర్స్‌కు సవాల్! ఆ పనిచేస్తే రూ.26 లక్షలు బహుమతి ప్రకటించిన గూగుల్

Flipkart Diwali Sale: ఐఫోన్ 16, 16 ప్రో, ప్రో మాక్స్ ఫోన్లపై షాకింగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి ధమాకా సేల్

Nokia 800 Tough: 6 ఏళ్ల తరువాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న నోకియా టఫ్ ఫోన్.. కొత్త అప్‌గ్రేడ్లతో సూపర్ కమ్‌బ్యాక్

Vivo V60e: మిడ్ రేంజ్ ఫోన్‌లో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీ… వివో వి60e లాంచ్

Amazon Diwali Sale: రూ47999కే ఐఫోన్ 15, వన్‌ప్లస్, శాంసంగ్‌పై బంపర్ డిస్కౌంట్లు.. అమెజాన్ దీపావళి బొనాన్జా సేల్

Itel A100C: నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ కాలింగ్.. ఇండియాలో ఐటెల్ తక్కువ బడ్జెట్ ఫోన్ లాంచ్

iphone 17 Discount: ఐఫోన్ 17పై తొలిసారి డిస్కౌంట్.. తక్కువ ధరలో తాజా ఫ్లాగ్‌షిప్‌.. ఎక్కడంటే?

Big Stories

×