BigTV English
Advertisement

Whatsapp : స్టూడెంట్స్ కు ఫ్రీ ల్యాప్ టాప్స్.. వాట్సాప్ లో మీకూ మెసేజ్ వచ్చిందా!

Whatsapp : స్టూడెంట్స్ కు ఫ్రీ ల్యాప్ టాప్స్.. వాట్సాప్ లో మీకూ మెసేజ్ వచ్చిందా!

Whatsapp : గత కొంత కాలంగా సైబర్ క్రైమ్​లు ఎక్కువగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. నకిలీ లింక్​, సందేశాలను పంపి, యూజర్స్​ను ఆకర్షితులయ్యేలా చేసి వారిని బురిడి కొట్టిస్తున్నారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి డబ్బులును కొల్లగొట్టేస్తున్నారు. లేదంటే వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఫ్రాడ్​ యాక్టివిటీస్​ లేదా ఫైనాన్షియల్ స్కామ్స్​ చేస్తున్నారు.


అలా ఇప్పుడు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఫ్రీ ల్యాప్​టాప్ స్కీమ్​ పేరుతో వాట్సాప్​లో ఓ మెసేజ్​ చక్కర్లు కొడుతోంది. అవగాహనం లేకుండా ఫ్రీ ల్యాప్​టాప్​కు ఆశపడి ఆ మెసేజ్​ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. పీఐబీ (ప్రెస్​ ఇన్​ఫర్మేషన్​ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఫ్రీ ల్యాప్​టాప్​ స్కీమ్ మెసేజ్​ జెన్యూన్ కాదు. అందుకే పీఐబీ ఇలాంటి మెసేజ్​ వస్తే దానిపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

మెసేజ్​లో ఏముంటుందంటే? – ఆ మెసేజ్​లో స్టూడెంట్స్​ను ఆకర్షితులను చేయడం కోసం ఫ్రీ ల్యాప్​టాప్​ స్క్రీమ్ గురించి ఉంటుంది. అందులో వారి పర్సనల్ డేటాతో పాటు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్​ ఫిల్ చేయమని ఓ ఫామ్ కూడా ఉంటుంది. దీని ద్వారా డేటాను కలెక్ట్ చేసి ఫ్రాడ్​ యాక్టివిటీస్​ లేదా ఫైనాన్షియల్ స్కామ్స్​లో ఆ డేటాను ఉపయోగిస్తారు.


అసలు ఫ్రీ ల్యాప్​ స్క్రీమ్​ మెసేజ్ ఏంటంటే? – ఆర్థికంగా స్థోమత లేని విద్యార్థుల కోసం ఫ్రీ ల్యాప్ స్కీమ్​ 2024ను ప్రారంభించారు. దీని ద్వారా 2024లో దాదాపు 96000కుపైగా విద్యార్థులకు ఫ్రీ ల్యాప్​టాప్స్​ ఇచ్చారు. ఇప్పటికే అప్లై చేసిన చాలా మందికి ల్యాప్​టాప్స్​ కూడా లభించాయి. అయితే ఇదే సమయంలో దీని అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కూడా ఈ స్కీమ్​ పేరుతో ఫేక్ లింక్​ను పంపి వ్యక్తిగత డేటాను కలెక్ట్ చేస్తున్నారు.

అందుకే పీఐబీ, యూజర్స్​ను​ అనుమానస్పద లింక్స్​పై క్లిక్ చేయొద్దని, సైబర్​ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచనలను జారీ చేసింది. అలానే పర్సనల్ డీటెయిల్స్​ షేర్​ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి స్కామ్​ల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలంటే? – గవర్నమెంట్ స్కీమ్స్​ – ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్​ అని మెసేజ్​లు, ఈమెయిల్స్​, బ్యానర్స్​ లేదా లింక్​లు వస్తే ముందుగా వాటిని వెరీఫై చేసుకోవాలి. అఫీషియల్​ గవర్నమెంట్ వెబ్​సైట్స్​లో వాటి గురించి వివరాలు ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. అన్​వెరీఫైడ్​ సోర్సెస్​ నుంచి వచ్చిన వాటిని అస్సలు నమ్మకూడదు. అధికారిక ప్రభుత్వ వెబ్​సైట్స్​ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. వాటినే పరిగణలోకి తీసుకోవాలి.

పర్సనల్ ఇన్​ఫర్మేషన్​ – అస్సలు ఎవరికీ కూడా, మరీ ముఖ్యంగా అన్​వెరీఫైడ్​ సోర్సెస్, మెసేజెస్​కు బ్యాంక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్​ ఇతర వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదు.

మాల్వేర్ లింక్స్ – అన్​వెరీఫైడ్​ మెసేజెస్​ మాల్వేర్ లింక్స్​ను కలిగి ఉంటాయి. ఒకవేళ దానిపై క్లిక్ చేస్తే, అందులో ఉన్న వైరస్​ మన డివైసెస్​లోకి ఇన్​స్టాల్​ అయిపోతుంది. దీంతో స్కామర్స్​కు మన పర్సనల్ డేటా, లాగిన్స్, బ్యాంక్ సహా ఇతర సమాచారం సులభంగా దొంగిలించేందుకు వీలుకలగుతుంది.

కాబట్టి ప్రతిఒక్క విద్యార్థి సహా ఇతరులు.. అనుమానస్పద, ఫేక్ లింక్స్, మెసేజ్​స్​, వెబ్​సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ALSO READ : షాక్ ఇచ్చిన ఐఫోన్ 15 ప్లస్… ఫ్లిప్కార్ట్ లో ఒక్కరోజే రూ.15వేల తగ్గింపు

Related News

Vivo 5G Premium Smartphone: వివో నుంచి ప్రీమియం 5జి ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Nokia Magic Max 5G: 2800 ఎంపీ కెమెరాతో నోకియా ఎంట్రీ.. మ్యాజిక్ మ్యాక్స్ 5జీ రివ్యూ

2026 Honda Civic Type R: హోండా సివిక్ టైప్ ఆర్ 2026.. ఈ కార్‌లో జర్నీ చేస్తే దిగాలన్న ఫీలింగే రాదు మావా

Samsung Galaxy S23 5G: ఇంత తక్కువ ధరలో 5G ఫోన్ వస్తుందా.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

OPPO Reno 15 Mini Phone: రూ.33వేల లోపే ఒప్పో రెనో 15 మినీ ఫోన్.. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌కి రేడీ అవ్వండి

Vivo Y31 5G Phone Offers: క్రేజీ డిస్కౌంట్ భయ్యా.. వివో Y31 ఫీచర్స్ తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Xiaomi Mini Drone Camera: ఒర్నీ.. ఈ ఫోన్ కెమెరా ఎగురుతుందా? మినీ డ్రోన్ కెమెరాతో షివోమీ మొబైల్ క్రేజీ ఎంట్రీ

Samsung Galaxy A56 5G: మార్కెట్లో దిగిన ఈ ఫోన్ ఫీచర్స్ తెలిస్తే.. ఇతర బ్రాండ్లు షేక్ అవ్వాల్సిందే!

Big Stories

×