BigTV English

Game Changer: అబ్బాయ్ కోసం బాబాయ్ దిగుతున్నాడు.. అల్లు అర్జున్ మ్యాటర్ తీస్తాడా..?

Game Changer: అబ్బాయ్ కోసం బాబాయ్ దిగుతున్నాడు.. అల్లు అర్జున్ మ్యాటర్ తీస్తాడా..?

Game Changer: మెగా ఫ్యామిలీ..  ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగు ఫ్యామిలీస్ లో ఒకటి. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి పెద్దగా మారి.. ఆ తరువాత తన కుటుంబం నుంచి ఒక్కొక్కరిని హీరోలుగా మార్చారు. మెగా  ఫ్యామిలీ నుంచే దాదాపు 10 మంది హీరోలు ఉన్నారు.   వారందరిని పక్కన పెడితే .. మెగా వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రామ్ చరణ్ తేజ్. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ కు కూడా విమర్శలు తప్పలేదు. అయినా వాటినేమి పట్టించుకోకుండా చిరు కొడుకు చరణ్ అన్న దగ్గర నుంచి చరణ్ తండ్రి చిరు అని చెప్పుకునేవరకు ఎదిగాడు.


ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఆ సినిమా తరువాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.  స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Nani: అది వచ్చినా పీకేది ఏం లేదు.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్


అన్ని మంచిగా జరిగి ఉంటే ఈపాటికే  గేమ్ ఛేంజర్ రిలీజ్ కూడా అయ్యిపోయేది. కొన్ని కారణాల వలన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. జనవరి 10 న  గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా ప్రమోషన్స్ కోసం దేశందాటడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. డిసెంబర్ 21 న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికోసం చిత్ర బృందం మొత్తం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు చరణ్ చెప్పుకొచ్చాడు.

అదేంటి.. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్  అయితే  ఇక ఇండియాలో ఉండదా అంటే..  ఎందుకు ఉండదు. జనవరి 4 న ఇండియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుతున్న  సమాచారం ప్రకారం రాజమండ్రి లేదా విశాఖపట్నం లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేనా.. ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఏంటంటే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారని సమాచారం.

ఈ ఏడాది  ఐటెంసాంగ్స్ లో ఆడిపాడిన హీరోయిన్స్ ఎవరెవరు అంటే.. ?

బాబాయ్ కోసం అబ్బాయ్ ఏదైనా చేస్తాడు.. అలాగే అబ్బాయ్ కోసం బాబాయ్ కూడా  ఏదైనా చేస్తాడు.  చరణ్ కోసం తన పనులను కొద్దిగా పక్కన పెట్టి   టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  అయితే బాబాయ్ – అబ్బాయ్ కలవడం ఇదేమి కొత్త కాదు. కానీ, ఈసారి కలయిక సరికొత్తగా ఉండబోతుంది. పవన్.. రిపబ్లిక్ ఈవెంట్ లో చేసిన రచ్చ ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ వివాదమే ఎక్కువ వినిపిస్తుంది.

మొన్నటి వరకు మెగా – అల్లు విభేదాలు పోయి.. ఇప్పుడు బన్నీ కేసు గురించి టాక్ నడుస్తోంది. ఈ కేసు విషయంలో వెనుక నుంచి ఎంత సపోర్ట్ గా  నిలబడినా.. బన్నీని పవన్ కలవలేదు. ఎందుకు కలవలేదు అనేది పెద్ద మిస్టరీ. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ దీని గురించి సీరియస్ అవుతాడా.. ? ప్రజల క్షేమం కోరుకొనే బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు కచ్చితంగా మృతిచెందిన రేవతి కుటుంబం గురించి మాట్లాడాలి. అది ఈ ఈవెంట్ లో జరుగుతుందా .. ? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. దీనికోసమే అందరూ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.  మరి ఈ వేడుకలో పవన్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×