iPhone 15 Plus : ఎప్పటినుంచో ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ధర ఎక్కువని ఆలోచిస్తున్నారా? ఆఫర్లో కొందామని అనుకుంటే మాత్రం ఇంతకన్నా బెస్ట్ ఆఫర్స్ ఇంకేం ఉండవు. ఫ్లిప్కార్ట్ తాజాగా ఐఫోన్ 15 ప్లస్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ ప్రియులకు దిమ్మతిరిగే డిస్కౌంట్ను అందిస్తుంది.
పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీతో ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఐఫోన్ 15 ప్లస్ ను కొనేయండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా ఐఫోన్ 15 పై భారీ ఆఫర్ను ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్స్ తో ఆపిల్ కంపెనీ ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసిన ఈ మొబైల్ ఫీచర్స్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది అత్యధికంగా కొనుగోళ్లు జరిగిన మొబైల్స్ జాబితాలో ఐఫోన్ 15 ప్లస్ టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇది డైనమిక్ ఐలాండ్, USB టైప్ – C పోర్టల్ లాంటి మెురుగైన ఫీచర్స్ తో వచ్చేసింది.
నిజానికి లాంఛ్ సమయంలో iPhone 15 Plus అసలు ధర రూ. 89,900 అయితే ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 15,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ ధర డీల్స్ ఎలా ఉన్నాయో పూర్తి వివరాలపై ఓ లుక్కేసేయండి.
iPhone 15 ధర, ఆఫర్లు –
ఐఫోన్ 15 ప్లస్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.63,999గా ఉంది. సాధారణంగా ధర రూ. 79,900. కాగా వినియోగదారులు ఇప్పుడు ఈ మెుబైల్ పై రూ. 15,000 తగ్గింపును పొందవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే, అదనంగా 5 శాతం తగ్గింపుతో రూ. 60,000కే కొనే అవకాశం ఉంది.
ఇందులో ఎక్స్చేంజ్ ఆఫర్స్ సైతం ఉన్నాయి పాత మొబైల్ లో మార్చేసి కొత్త మొబైల్ లో కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ఫోన్ పని చేసే తీరు కెపాసిటీని బట్టి ధర నిర్ణయించి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ మొబైల్ పై నో కాస్ట్ ఈ అమ్మాయి సదుపాయం సైతం ఉంది బ్యాంక్ ఆఫర్స్ ని బట్టి నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్స్ –
ఐఫోన్ 15 ప్లస్ ప్రోమోషన్ టెక్నాలజీతో 6.7 – అంగుళాల OLED ప్యానెల్, 60Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ A16 బయోనిక్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ 4383 mAh బ్యాటరీతో వచ్చింది మంచి బ్యాకప్ ను అందిస్తుంది.
ఇక కెమెరా గురించి చెప్పాలంటే.. iPhone 15 Plus 48 MP ప్రైమరీ షూటర్‌తో పాటు 12 MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం iPhone 15 Plus 12 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది 5G, 4G VOLTE, 4G, 3G, 2G, బ్లూటూత్ v5.3కి మద్దతు ఇస్తుంది. ఇక ఈ యాపిల్ ఐఫోన్‌కు 1 సంవత్సరం వారంటీ.. బాక్స్ యాక్సెసరీస్‌లో 1 సంవత్సరం వారంటీని సైతం ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం.. కొనాలనుకునే యూజర్స్ వెంటనే ట్రై చేసేయండి.
ALSO READ : ఒక్క మెుబైల్ పై ఏకంగా రూ.53వేల డిస్కౌంటా! ఆఫర్ అరాచకం బాస్