iPhone Discounts: యాపిల్ లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సేల్స్ లలో ఒకటైన ‘ఫ్లిప్‌కార్ట్ గోట్ (GOAT) సేల్ 2026’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఐఫోన్లపై ఊహించని రేంజ్‌లో ఆఫర్లను రివీల్ చేసింది. జూలై 4 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో యాపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన ‘ఐఫోన్ 17’ పై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీగా ధరలను తగ్గించింది. బేస్ మోడల్ అయిన ఐఫోన్ 17 పై నేరుగా రూ.12,000 వరకు ఫ్లాట్ తగ్గింపును ప్రకటించింది. దీనివల్ల రూ.82,900 విలువైన బేసిక్ వేరియంట్.. గోట్ సేల్ లో కేవలం రూ.70,900కే సొంతం చేసుకోవచ్చు.
ప్రీమియం ఫీచర్లతో వచ్చే ఐఫోన్ ప్రొ మోడల్స్ కొనాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ గోల్డెన్ చాన్స్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రొ మాక్స్ మోడల్స్‌పై ఏకంగా రూ.22,000 వరకు డిస్కౌంట్ ప్రకటించారు. ఐఫోన్ 17 ప్రొ అసలు ధర రూ.1,34,900 కాగా ఆఫర్ లో రూ.1,12,900 కే లభించనుంది. అటు అత్యంత లగ్జరీ మోడల్ అయిన ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,900 నుండి తగ్గింపు తర్వాత రూ.1,27,900కే అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ డీల్స్ సైతం సేల్ లో ఉండనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ధ్రువీకరించింది.
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. జులై 4న ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు మాత్రం 24 గంటల ముందే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. అంటే జులై 3 నుంచే వారికి సేల్ కు యాక్సెస్ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ (HSBC) క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లకు అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే జులై 9వ తేదీ వరకూ మాత్రమే ఈ గోట్ సేల్ అందుబాటులో ఉండనుండటం గమనార్హం.
Also Read: మీ ఇంటి పూజా గదికి రాయల్ లుక్ ఇచ్చే డెకరేషన్ టిప్స్.. తక్కువ బడ్జెట్‌లో ఇలా చేయండి
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ర్యామ్, స్టోరేజ్ చిప్‌ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల యాపిల్ ప్రొడక్ట్స్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఐఫోన్ 18 సిరీస్ ధరలు మరింత ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఐఫోన్ 17 సిరీస్‌ను ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకోవడానికి ‘ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్’ ఒక బెస్ట్ ఆప్షన్ అని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: వర్షాకాలంలో వీకెండ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్ సమీపంలో బెస్ట్ వాటర్‌ఫాల్స్ ఇవే