E-Paper
Advertisement

రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారా? మీ కన్ఫర్మ్ టికెట్‌ ఇతరులకు బదిలీ చేయండి ఇలా

రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారా? మీ కన్ఫర్మ్ టికెట్‌ ఇతరులకు బదిలీ చేయండి ఇలా
Advertisement

Train Ticket Transfer| రైలు ప్రయాణం కోసం ముందుగానే కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకున్నారా? అయితే చివరి నిమిషంలో ఏదైనా కారణంతో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చిందా? ఇలాంటి సమయంలో టికెట్ డబ్బులు వృథా అవుతాయని చాలామంది ఆందోళన చెందుతారు. అయితే భారతీయ రైల్వే ఒక ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తోంది. మీ కన్ఫర్మ్ టికెట్‌ను మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే ఎవరికి పడితే వారికి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు. దీనికి కొన్ని అర్హతలు, గడువులు ఉన్నాయి.

కుటుంబ సభ్యులకు టికెట్ బదిలీ చేసే అవకాశం

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. కన్ఫర్మ్ టికెట్‌ను కొన్ని కుటుంబ సభ్యుల పేర్లపై మార్చుకోవచ్చు. తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య, సోదరుడు, సోదరి ఈ జాబితాలో ఉన్నారు.అయితే స్నేహితులు, పొరుగువారు, దూరపు బంధువులకు ఈ సదుపాయం వర్తించదు. టికెట్ బదిలీ కోసం ప్రయాణికుడు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందే చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు దరఖాస్తు అందించాలి. అధికారులు మీ డాక్యుమెంట్స్ పరిశీలించి అనుమతి ఇస్తారు.

విద్యార్థులు, పెళ్లి బృందాలు కూడా సదుపాయం

Advertisement

ఎడ్యుకేషన్ ట్రిప్‌లకు వెళ్లే స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా టికెట్ పేరు మార్పు అవకాశం ఉంది. ఇందుకోసం స్కూల్ లేదా కాలేజీ ప్రిన్స్‌పాల్ రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. రైలు బయలుదేరడానికి కనీసం 48 గంటల ముందు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
పెళ్లి బృందాల్లో ఒకరు ప్రయాణించలేని పరిస్థితి వచ్చినా పేరు మార్పు కోరవచ్చు. టకెట్ లీడర్ కనీసం 48 గంటల ముందే దరఖాస్తు సమర్పించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక విధుల కారణంగా ప్రయాణించలేకపోతే, వారి స్థానంలో మరో ఉద్యోగి ప్రయాణించేందుకు అనుమతి కోరవచ్చు. సంబంధిత అధికారి 24 గంటల ముందే దరఖాస్తు చేయాలి. ఎన్‌సీసీ క్యాడెట్లకు కూడా ఈ సదుపాయం ఉంది. వారి ఇన్‌ఛార్జ్ 24 గంటల ముందే దరఖాస్తు చేయాలి.

టికెట్ పేరు మార్పునకు రెండు ముఖ్యమైన పరిమితులు

ఒక కన్ఫర్మ్ టికెట్‌పై ప్రయాణికుడి పేరును ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ఒకసారి పేరు మార్చిన తర్వాత మళ్లీ మార్పు చేయడం సాధ్యం కాదు. విద్యార్థులు, పెళ్లి బృందాలు, ఎన్‌సీసీ బృందాల విషయంలో మొత్తం ప్రయాణికుల్లో గరిష్ఠంగా 10 శాతం మందికి మాత్రమే పేరు మార్పు అనుమతి ఉంటుంది.

Advertisement

Also Read: ఈ పాస్‌పోర్ట్‌కు సూపర్ క్రేజ్.. బెంగళూరులో రాత్రి 2 గంటల నుంచి బారులు తీరిన యువత

కన్ఫర్మ్ టికెట్ బదిలీ కోసం ఈ విధానాన్ని అనుసరించాలి

ముందుగా మీ అర్హతకు అనుగుణంగా ఒక అప్లికేషన్ రేడీ చేసుకోవాలి. సంబంధిత గడువులోగా రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌కు సంప్రదించాలి. అసలు టికెట్, మీ గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్), కొత్త ప్రయాణికుడి గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. అవసరమైతే బంధుత్వాన్ని నిరూపించే పత్రాలు కూడా సమర్పించాలి.

చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు దరఖాస్తు అందించిన తర్వాత అధికారులు పత్రాలను పరిశీలిస్తారు. అనుమతి లభించినప్పుడే పేరు మార్పు పూర్తవుతుంది.

Also Read: పెన్షనర్లు ఇక లైన్‌లో గంటలకొద్ది నిలబడాల్సిన పనిలేదు.. లైఫ్ సర్టిఫికెట్ ఇంటి నుంచే సమర్పించండి

ముందుగానే రైల్వే అధికారులను సంప్రదించడం మంచిది

ఈ సదుపాయం వల్ల కొన్ని పరిస్థితుల్లో కన్ఫర్మ్ టికెట్ వృథా కాకుండా ఉపయోగపడుతుంది. అయితే నిబంధనలు, గడువులు తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తు చేసే ముందు సమీప రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలో తాజా నియమాలను నిర్ధారించుకోవడం మంచిది.

Related News

రైలు కిటికీలకు అద్దాలు ఉన్నా ఇనుప కడ్డీలు ఎందుకు? ఇదీ అసలు కథ!

వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్‌ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!

గంగానదిపై వాటర్ మెట్రో ప్రయాణం.. టికెట్ ధర జస్ట్ రూ.50!

విమానం రంగంలో చైనా దూకుడు.. ఎలక్ట్రిక్ విమానం తయారు, తొలి ప్రయోగం సక్సెస్

అఖండ భారత్ లో ఇన్ని దేశాలు ఉండేవా? పాకిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఆసక్తికర విశేషాలివే!

ట్రావెల్ ట్రిప్ ప్లానింగ్ కోసం AI ఉపయోగిస్తున్నారా? ఈ సమస్యలు రావచ్చు జాగ్రత్త

60 రోజుల టికెట్ బుకింగ్‌ రూల్ మారనుందా? రైల్వే కొత్త ప్లాన్ ఇదే!

Big Stories

Advertisement
×