E-Paper
Advertisement

EcoFlow పోర్టబుల్ పవర్ స్టేషన్.. కరెంట్ పోయినా మీ ఇంట్లో వైఫై, ల్యాప్‌టాప్ ఆగవు!

EcoFlow పోర్టబుల్ పవర్ స్టేషన్.. కరెంట్ పోయినా మీ ఇంట్లో వైఫై, ల్యాప్‌టాప్ ఆగవు!
Advertisement

EcoFlow Portable Power Station: ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా నైట్ టైమ్ ఇంట్లో రిలాక్స్ అవుతున్నప్పుడు అడగకుండా.. కరెంట్ పోతే ఎలా ఉంటుంది? చిరాకు మామూలుగా ఉండదు కదా! వైఫై ఆగిపోతుంది, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ అయిపోతుంది, ఉక్కపోత మొదలవుతుంది. ఇలాంటి.. పవర్ కట్స్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టేందుకే మార్కెట్లోకి వచ్చింది EcoFlow Portable Power Station. కేవలం ఒక గంటలోనే.. ఫుల్ ఛార్జ్ అయిపోయే ఈ స్మార్ట్ పవర్ గ్యాడ్జెట్, మీ ఇంటి మినీ ఇన్వర్టర్‌లా ఎలా పనిచేస్తుందో, దీని ట్రెండీ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు. ముఖ్యంగా.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి, కరెంట్ పోతే ఆఫీస్ పనులన్నీ ఆగిపోతాయి. పెద్ద పెద్ద ఇన్వర్టర్లు కొనాలంటే.. బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి.. స్పేస్ ప్రాబ్లం వస్తుంది. అందుకే.. ఇప్పుడు అందరి చూపు ఈ ‘EcoFlow’ పోర్టబుల్ పవర్ స్టేషన్‌పై పడింది.

60 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్!

Advertisement

సాధారణ ఇన్వర్టర్ బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి.. గంటల సమయం పడుతుంది. కానీ EcoFlow పవర్ స్టేషన్‌లో ఉన్న సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. వల్ల కేవలం 60 మినిట్స్‌లోనే.. 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంటే.. మీరు బయటకు వెళ్లే ముందు లేదా కరెంట్ వస్తుందని తెలిసిన తక్కువ టైమ్‌లోనే దీనిని క్విక్‌గా రీఛార్జ్ చేసుకోవచ్చు.

వైఫై, ల్యాప్‌టాప్, ఫ్యాన్:

ఇంట్లో కరెంట్ పోగానే ఇది మీ రెస్క్యూ టీమ్‌లా మారుతుంది. దీనికి.. ఉండే మల్టిపుల్ పోర్ట్స్ (AC అవుట్‌పుట్, USB పోర్ట్స్) ద్వారా మీ వైఫై రూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ ఫోన్స్, ఎల్‌ఈడీ లైట్లు, అలాగే.. చిన్న టేబుల్ ఫ్యాన్లను కూడా చాలా ఈజీగా రన్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి.. ఇంటర్నెట్ ఆగిపోకుండా బ్యాకప్ ఇవ్వడంలో ఇది తోపు అని చెప్పొచ్చు.

10 ఇయర్స్ లాంగ్-లైఫ్ LiFePO4 బ్యాటరీ:

Advertisement

సాధారణ పవర్ బ్యాంకులు లేదా ఇన్వర్టర్ బ్యాటరీలు రెండు మూడేళ్లలోనే పాడవుతాయి. కానీ EcoFlow లో అడ్వాన్స్‌డ్ LiFePO4 బ్యాటరీని వాడారు. దీని వల్ల ఈ పవర్ స్టేషన్ దాదాపు 10 సంవత్సరాల పాటు.. ఎలాంటి కంప్లైంట్ లేకుండా.. లాంగ్-లైఫ్ ఇస్తుంది. అంటే ఒక్కసారి.. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు పవర్ టెన్షన్ ఉండదు.

Also Read: థియేటర్ మీ ఇంట్లోనే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

లైట్‌వెయిట్ & అవుట్‌డోర్ ట్రిప్స్‌కు పర్ఫెక్ట్:

దీని బరువు చాలా తక్కువ. పట్టుకోవడానికి పైన ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది. కాబట్టి దీనిని ఇంట్లోనే కాకుండా.. మీరు కార్‌లో లాంగ్ డ్రైవ్స్ వెళ్లినప్పుడు, క్యాంపింగ్ లేదా అవుట్‌డోర్ నైట్ ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు వెంట పట్టుకెళ్లొచ్చు. అడవిలో టెంట్ వేసుకున్నా సరే.. మీ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, క్యాంప్ లైట్లు ఆన్ చేసుకోవడానికి ఇది సూపర్బ్‌గా యూజ్ అవుతుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా దీనిని ఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంది.

పవర్ కట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని ఈ రోజుల్లో EcoFlow ఒక మస్ట్ హావ్ గ్యాడ్జెట్. ముఖ్యంగా స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్, ఐటీ ఎంప్లాయ్స్ , ట్రావెల్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ల్యాప్‌టాప్ డెడ్ అయిపోతుందనే భయం లేకుండా, ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి ఇది పక్కా హెల్ప్ అవుతుంది.

Tags

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×