E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 ఈ వారం ఎలిమినేట్ అయిన లేడి కంటెస్టెంట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ 10 ఈ వారం ఎలిమినేట్ అయిన లేడి కంటెస్టెంట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

Bigg Boss 10 Telugu Elimination: బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం నేటితో పదవ వారం పూర్తి చేసుకుంది. ఇక ఈవారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదివరకు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రామకృష్ణ హౌస్ నుంచి బయటకు వస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ఎవరు ఊహించని విధంగా ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లేడీ కంటెస్టెంట్ బయటకు రాబోతున్నట్టు సమాచారం.

శ్వేత నాయుడు ఎలిమినేట్..

బిగ్ బాస్ పదవ వారం నామినేషన్స్ లో భాగంగా ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, శ్వేత, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, రామకృష్ణ, శివకుమార్ ఉన్నారు. ఇలా నామినేషన్స్ లో ఉన్న వారిలో ఓటింగ్ పరంగా శివకుమార్ చాలా లీస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రామకృష్ణ, నీతూ మాస్టర్ కూడా డేంజర్ పొజిషన్లో ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ ఎలిమినేట్ అయ్యారని డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతూ మాస్టర్ కూడా బయటకు వస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా శ్వేత నాయుడు(Swetha Naidu) ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన శ్వేత..

Advertisement

ఈవారం శ్వేత నాయుడు ఎలిమినేషన్ కి సంబంధించి ఎపిసోడ్ కూడా పూర్తి అయ్యిందని ఈమె బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా బయటకు రావడంతో ఈ వారం శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యారని స్పష్టమవుతుంది. ఇక ఈమె ఎలిమినేట్ కావడంతో ఈమె రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి. శ్వేత నాయుడు బిగ్ బాస్ కార్యక్రమం వైల్డ్ కార్డు(Wild Card) అనగా ఐదో వారం హౌస్ లోకి అడుగుపెట్టారు.

శ్వేత నాయుడు రెమ్యూనరేషన్..

ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలపాటు కొనసాగిన శ్వేత నాయుడు పదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా వారానికి ఈమె 1.5 లక్షల రూపాయల రేమ్యూనరేషన్ (Remuneration) అందుకున్నారని ఇలా 5 వారాలకు గాను 7.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ 10 వ సీజన్ కు ఎంపికైన ఈమె ఈ కార్యక్రమం మొదటి రోజు హౌస్ లోకి వెళ్లకుండా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా 5 వారాల పాటు కొనసాగిన శ్వేత ఐదవ వారం బయటకు వచ్చారు. ఇక ఈవారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని వచ్చే వారం నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం.

Advertisement

Also Read: గిరిబాబు మరణం.. చివరి చూపుకు నోచుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటి అవుట్..

Podarillu Today Episode : చక్రీ పై మహా సీరియస్.. ఒంటరిగా మిగిలిన కన్నా.. ప్రాణాలకు తెగించి కాపాడిన నారాయణ..

Intinti Ramayanam Today Episode: కమల్ బర్త్ డే కోసం ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. పల్లవి ప్లాన్ అదిరిపోలే..

Karthika Deepam 2 Serial Today Episode November 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన  దక్షిణమూర్తి 

బిగ్ బాస్ హౌస్ లో పూరీ జగన్నాథ్ సపోర్టు ఎవరికో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మీనా పై బాలు సీరియస్.. అరుణ్ కు మీనా వార్నింగ్.. ట్విస్ట్ అదిరింది..

Brahmamudi Serial Today Episode November 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు సంతకం చేస్తే రాజు ఏం చేశాడో తెలుసా..?

Big Stories

Advertisement
×