E-Paper
Advertisement

నోకియా నుంచి AI ఫీచర్లతో 4G కీప్యాడ్ ఫోన్లు.. బటన్ నొక్కితే చాలు అన్నీ అదే చూసుకుంటుంది!

నోకియా నుంచి AI ఫీచర్లతో 4G కీప్యాడ్ ఫోన్లు.. బటన్ నొక్కితే చాలు అన్నీ అదే చూసుకుంటుంది!
Advertisement

Nokia New 4G Phones: మారుతున్న కాలానికి అనుగుణంగా సాధారణ కీప్యాడ్ ఫోన్లు కూడా ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ (HMD) సరికొత్త ఫీచర్లతో కూడిన 4 కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోకియా 210 4G, 235 4G (సెకండ్ ఎడిషన్), 215 4G (సెకండ్ ఎడిషన్), నోకియా 200 4G పేర్లతో ఇవి విడుదలయ్యాయి.

ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:

ఈ ఫోన్ల ప్రత్యేకత ఏమిటంటే.. వీటిలో ప్రత్యేకంగా ఒక AI అసిస్టెంట్ బటన్‌ను అందించారు. ఈ బటన్ నొక్కి వాయిస్ కమాండ్స్ ద్వారా టార్చ్ ఆన్ చేయడం, కెమెరా ఓపెన్ చేయడం, అలారాలు పెట్టుకోవడం, ఎవరికైనా ఫోన్ చేయడం వంటి పనులను చాలా సులువుగా చేసుకోవచ్చు. సైకీ AI సాంకేతికతతో పనిచేసే ఈ ఫీచర్ మొదటి 180 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత దీనికోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: జేబులో ఇమిడిపోయే బుజ్జి కారు.. ఫ్లిప్ చేస్తే అదిరిపోయే మొబైల్.. ఎక్కడ దొరుకుతుందంటే?

క్లౌడ్ సేవలు.. అదిరిపోయే బ్యాటరీ:

పరిమితమైన స్టోరేజ్ సమస్య లేకుండా ఉండటానికి ఇందులో క్లౌడ్ సర్వీసెస్ సదుపాయం కల్పించారు. దీనివల్ల ఇంటర్నెట్ ద్వారా వీడియోలు, వాతావరణ విశేషాలు, స్పోర్ట్స్ స్కోర్లను సులభంగా చూసుకోవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. దీనిలో ఎక్కువ కాలం మన్నికనిచ్చేలా 1,450mAh బ్యాటరీని అమర్చారు. వీటికి యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

డిజైన్, డిస్‌ప్లే విశేషాలు:

Advertisement

నోకియా క్లాసిక్ లుక్‌తోనే మెటాలిక్ ఫినిషింగ్‌తో ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. నోకియా 215, 235 మోడళ్లు 2.8 ఇంచుల స్క్రీన్‌తో వస్తుండగా.. మిగిలిన రెండు ఫోన్లు 2.4 ఇంచుల స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. వీటితో పాటు బేసిక్ కెమెరా, ఎఫ్‌ఎమ్ రేడియో, హెడ్‌ఫోన్ జాక్, వీడియో కాలింగ్ కోసం ‘ఎక్స్‌ప్రెస్ చాట్’ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల హడావుడి లేకుండా.. తక్కువ ధరలో ఫోన్ వాడాలనుకునే వారికి, సెకండరీ డివైజ్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.

Also Read: మొబైల్ గేమర్స్‌కు వరం.. ఈ ‘ఐస్ మేకర్’ గ్యాడ్జెట్ ఉంటే మీ ఫోన్ అస్సలు వేడెక్కదు!

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×