BigTV English
Advertisement

Iphone 15 : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

Iphone 15 : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

పండగల సీజన్‌ వచ్చిందంటే చాలు, అందరి కళ్లు ఇ-కామర్స్‌ సంస్థల ఆఫర్లపైనే ఉంటాయి. ముఖ్యంగా ఏడాదికి ఓసారి వచ్చే పండగ సేల్స్‌ కోసం టెక్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే అమెజాన్‌ , ఫ్లిప్‌కార్ట్‌ వంటి బడా సంస్థలు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్, బిగ్‌ బిలియన్‌ సేల్ ను తీసుకొచ్చేశాయి. మరికొన్ని సంస్థలు కూడా పండగ రాయితీలు, ప్రయోజనాలను అందుబాటులో ఉంచాయి.


పండగ సేల్స్​ రావడంతో యాపిల్​ ఐఫోన్‌ ప్రియుల దృష్టి ఈ సెక్యురిటీ బ్రాండెడ్​ స్మార్ట్ ఫోన్ ఆఫర్లపైన పడింది. అందుకు టగ్గట్టే టెక్‌ ప్రియుల కోసం ప్రముఖ ఇ- కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పేశాయి. ఈ రెండు సంస్థలు ప్రకటించిన పండగ సేల్స్‌లో ఐ ఫోన్లపై ప్రత్యేకమైన సూపర్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. పెద్ద ఎత్తున రాయితీ, బ్యాంక్‌ ఆఫర్లతో తక్కువ ధరకే వీటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపాయి. మరి ఒకవేళ మీరు ఈ పండగ సేల్స్‌లో యాపిల్‌ ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ఫిక్స్ అయ్యారా? అయితే ఈ సేల్​లో ఐ ఫోన్‌ ధరలు ఎంత వరకు తగ్గాయో తెలుసుకుందాం.

ఐఫోన్​ 15 రూ.49,999 – రీసెంట్​గా యాపిల్​ ఐఫోన్‌ 16 సిరీస్ ను గ్రాండ్​ గా మార్కెట్​లోకి లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ను యూజర్స్​ ఎగబడి మరీ కొంటున్నారు. అయితే ఇదే సమయంలో ఐఫోన్ 16 సిరీస్ ను విడుదల చేసిన సందర్భంగా ఐఫోన్‌ 15 ధరను తగ్గించింది యాపిల్‌. 128 జీబీ బేస్‌ వేరియంట్‌ ధర రూ.69,900గా ఉండాలి. అయితే తాజా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్​ ను రూ.54,999కే అందిస్తోంది. అంటే ఈ లెక్కన దాదాపు రూ.14 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. దీనిని ఇ- కామర్స్‌ ప్లాట్‌ ఫామ్‌ అదనపు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ద్వారా కొంటే రూ.3 వేలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొంటే మరో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే మొత్తంగా చూస్తే మరో రూ.5 వేల తగ్గింపుతో ఈ ఐ ఫోన్‌ 15ను రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు అన్న మాట. దీని ఫీచర్స్ విషయానికొస్తే 6.1 ఇంచ్​ ఓఎల్‌ఈడీ సూపర్‌ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. డైనమిక్‌ ఐలాండ్‌తో కూడిన నాచ్‌ డిస్‌ప్లే, 48 ఎంపీ కెమెరా కూడా ఇందులో ఉంది.


ALSO READ : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

ఐఫోన్‌ 13 రూ.39,999- ఇక ఐఫోన్‌ 13 విషయానికొస్తే అమెజాన్‌ మంచి డిస్కౌంట్​ ను ప్రకటించింది. ఈ పండగ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ​ను రూ.41,999కే అందుబాటులో ఉంచింది. దీన్ని ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొంటే రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్‌ ఇస్తోంది. అంటే ఈ వేరియంట్‌ రూ.39,999కే దక్కించుకోవచ్చు అన్న మాట. దీని ఫీచర్స్ విషయానికొస్తే 6.1 ఇంచ్​ సూపర్‌ రెటీనా డిస్‌ప్లే, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇంకా ఇందులో డ్యుయెల్‌ కెమెరా 12 ఎంపీ సెన్సర్‌, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. 3240mAh బ్యాటరీ, 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కెపాసిటీతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మూడేళ్ల క్రితం యాపిల్‌ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.

 

Related News

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Amazon Bumper offer: మ్యూజిక్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఇదే సరైన సమయం

Oppo 5G: 210ఎంపి కెమెరాతో ఒప్పో గ్రాండ్ ఎంట్రీ.. 7700mAh బ్యాటరీతో మాస్టర్‌ బ్లాస్టర్ ఫోన్

Big Stories

×