Google Chrome : క్రోమ్ ను గూగుల్ విక్రయించాల్సిందేనా ప్రపంచ వ్యాప్తంగా సెర్చ్ ఇంజన్ పై గుత్తాధిపత్యం వహిస్తుందనే ఆరోపణలతో దారులు మూసుకుపోయాయా? డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) దాఖలు చేసిన పిటీషన్ కు ఆల్ఫాబెట్ తలవంచనుందా? అసలు ఏం జరగనుంది.. గూగుల్ దారెటు అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక షాకింగ్ విషయాలు తెలిపింది.
ఆల్ఫాబెట్ కు చెందిన గూగుల్.. ప్రపంచ సెర్చ్ ఇంజన్ పై గుత్తాధిపత్యం వహిస్తుందనే ఆరోపణలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో గూగుల్ పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ కేసుతో చిక్కుల్లో పడిన ఆల్ఫాబెట్ గూగుల్ ను విక్రయించాల్సి వస్తే అది వినియోగదారులతో పాటు తమ వ్యాపారానికి సైతం కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని గూగుల్ చెప్పుకొస్తుంది.
అయితే గూగుల్ అమ్మకంపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాదన మరో విధంగా ఉంది. ఇప్పటికే సెర్చ్ ఇంజన్ లో గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తుందని.. ఈ విషయానికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తుంది.
ఈ వాదనల నేపథ్యంలో గూగుల్ క్రోమ్ ను ఆల్ఫాబెట్ 20 బిలియన్ డాలర్లకు విక్రయిస్తున్నట్లు ఓ వార్తా పత్రిక తెలపింది. ఒత్తిళ్ల నేపథ్యంలో గూగుల్ ను విక్రయించి.. త్వరలోనే మరింత మెరుగ్గా కొత్త సెర్చ్ ఇంజన్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నట్లు వెల్లడించింది.
ఇక ఈ విషయంపై స్పందించిన అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయమూర్తి మెహతా.. గూగుల్ ను ఆల్ఫాబెట్ విక్రయించినా.. అంతకంటే భద్రంగా ఉండే వారి చేతిలోకి వెళ్లాలని తెలిపారు. ఆల్ఫాబెట్ అనుకున్న విధంగా బిలియన్ డాలర్ల ఆదాయ వాటాను చెల్లించడానికి ఎదుటి సంస్థ పోటీ పడితేనే ముందుకు వెళ్లాలని సూచించారు. అన్ని స్మార్ట్ ఫోన్ బ్రౌజర్స్ క్రోమ్ ని డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్ గా చేసుకోవటాన్ని తాము తిరస్కరించలేమని.. అయితే ముందు ముందు ఇది ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలిపారు.
గూగుల్ క్రోమ్ కు సంబంధించిన ఈ తీర్పు వచ్చే ఏడాది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇంతకంటే ముందేే ఆల్ఫాబెట్ క్రోమ్ ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక ఏది ఏమైనా గూగుల్ క్రోమ్ విషయంలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ సెర్చ్ రంగాన్ని శాసిస్తున్న గూగుల్ కు అడ్డుకట్ట వేయాలని కొందరు వాదిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజన్, ఫోటోస్, మెయిల్, మ్యాప్స్, గూగుల్ డ్రైవ్.. ఇలా ప్రతీ విషయంలో తన ఆధిపత్యాన్ని చూపిస్తున్న గుగుల్ పై వినియోగదారులు ఎక్కువగా ఆధారపడిపోతున్నారని సైతం చెప్పుకొస్తున్నారు.