trinayani serial today Episode: నేత్రికి రివాల్వర్ ఎక్కుపెట్టి ఎవరు నువ్వు అని అడుగుతుంది తిలొత్తమ్మ. నేను త్రినేత్రి అంటుంది. విశాల్ త్రినేత్రి కాదు త్రినయని అంటాడు. కాదని చెప్తుంది. ఇంతలో గాయత్రి పాప పూల కుండీ తీసుకుని తిలొత్తమ్మకు విసురుతుంది. పూల కుండీ తగలగానే తిలొత్తమ్మ కిందపడిపోతుంది. ఆమె చేతిలోని రివాల్వర్ నేత్రి తీసుకుని తిలొత్తమ్మ తల మీద గురి పెట్టి.. నేను కాల్చను కానీ నువ్వు చేసిన పిచ్చి చేష్టలకు మండిపడుతున్నాను. అయినా సరే విడిచి పెడుతున్నాను అంటే కారణం విశాల్ బాబు గారిని చూసే..
ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా బెదిరిస్తే మాత్రం నేను మీరన్నట్టు నయనినా..? త్రినేత్రినా..? అని ఆలోచించకుండానే కాల్చిపారేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో దురందర గాయత్రి పాప ఆడుకుంటూ ప్లవర్ వాజ్ విసిరిందేమో అంటుంది. ఆడుకుంటూ వేసిందో మా మమ్మీ తల పగులగొడుతూ వేసిందో అంటాడు వల్లభ. ఏదైతే ఏముంది రిజల్ట్ వచ్చింది కదా..? అంటుంది హాసిని. అమ్మా నయని జోలికి వెళ్లొద్దని చెప్పినా ఎందుకు వెళ్లావు అంటాడు విశాల్. తిలొత్తమ్మను వల్లభ అక్కడి నుంచి తీసుకెళ్తాడు.
తిలొత్తమ్మ తలకు వల్లభ నూనె చుక్కలు వేయగానే.. మునివేళ్లతో మర్ధన చేయమంటుంది తిలొత్తమ్మ. తనకు రాదని వల్లభ చెప్తూ.. నీకు ఇలా జరుగుతుందని హాసినికి ముందే తెలుసంటా మమ్మీ అంటాడు వల్లభ. ఇంకా నయం మమ్మీ రక్తం రాలేదు. ఏ రాయో వేసి ఉంటే కుట్లు పడేవి అంటాడు వల్లభ. కుట్లు కాదురా.. నా ఫోటోకు దండ పడేది అంటుంది తిలొత్తమ్మ. అది నయనియో కాదో రేపు తేలుద్దాము అంటుంది తిలొత్తమ్మ. మళ్లీ బెదిరిస్తావా..? మమ్మీ అంటాడు వల్లభ. ఈసారి సెంటుమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తానని చెప్తుంది తిలొత్తమ్మ.
గార్డెన్‌లో నేత్రి ఒక్కతే మాట్లాడుకుంటుంది. తిలొత్తమ్మను తిడుతుంది. నా జోలికి వస్తే అమ్మవారి ముందు కొబ్బరికాయను కొట్టినట్టు కొట్టేస్తాను అనుకుంటుంది. ఇంతలో గాయత్రి పాప వచ్చి అమ్మా అని పిలుస్తుంది. తిరిగి చూసిన నేత్రి కూల్ గా పాపను దగ్గరకు తీసుకుంటుంది. దూరం నుంచి గమనిస్తున్న విశాల్ హ్యాపీగా ఫీలవుతాడు. పాప ముందు నీకు థాంక్స్ చెప్పాలి అంటూ నేత్రి పాపకు థాంక్స్ చెప్పి ముద్దు పెడుతుంది. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. విశాల్ వచ్చి పాపను పట్టుకుని అమ్మా చూశావా.. నీ కోడలు ఎలా మాట్లాడుతుందో.. దీనికి పరిస్కారం ఏంటో నువ్వే దారి చూపించాలి అంటాడు.
వల్లభ, సుమనను తీసుకుని గార్డెన్ లో కూర్చున్న తిలొత్తమ్మ దగ్గరకు తీసుకెళ్తాడు. ఏమన్నాడు వీడు అని తిలొత్తమ్మ అడుగుతుంది. నేను బట్టలు మడత పెడుతుంటే.. కిచ్ కిచ్ అని సైగ చేసి ఇక్కడకు తీసుకొచ్చాడు అని చెప్తుంది సుమన. దీంతో తిలొత్తమ్మ కోపంగా వల్లభను తిడుతుంది. సరిగ్గా చెప్పి తీసుకురావొచ్చు కదా..? సైగలు ఎందుకు చేశావు అంటుంది. సుమనకు సారీ చెప్తుంది. దీంతో సుమన సారీ ఎందుకులే అత్తయ్యా పెద్దబావ గారికి బ్రెయిన్ లేదని తెలుసు కదా..? అంటుంది. తర్వాత నేత్రి ఎవరనేది తెలుసుకోవడానికి తను ప్లాన్ చేసినట్టు తిలొత్తమ్మ చెప్తుంది. గాయత్రి పాపను నిద్ర పుచ్చితే.. గాయత్రి దేవి వస్తుంది. అప్పుడు నిజం తెలిసిపోతుంది. అందుకే ఈ మత్తు మందు తీసుకెళ్లి పాలలో కలిపి గాయత్రి పాపకు తాగించాలి అని చెప్తుంది తిలొత్తమ్మ.
పావణమూర్తికి కాఫీ, గాయత్రిపాపకు పాలు తీసుకురావడానికి నేత్రి కిచెన్ లోకి వెళ్తుంది. ఇంతలో లోపలకి వచ్చిన తిలొత్తమ్మ, సుమన, వల్లభ ముగ్గురు కలిసి పాలలో మత్తుమందు కలపడానికి ట్రై చేస్తారు. సుమన, వల్లభ భయపడగానే.. తిలొత్తమ్మ మత్తు మందు తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంది. సుమన, వల్లభ హాల్ లోకి వెళ్తారు. అక్కడ విశాల్, విక్రాంత్ దేవీపురం చెందిన ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటుంటారు.
కిచెన్ లోకి వెళ్లిన తిలొత్తమ్మ, నేత్రికి మాటలు చెప్తూ.. పాలలో మత్తుమందు కలుపుతుంది. నేను నీకు రివాల్వర్ గురి పెట్టడం తప్పే అంటుంది. ఇంతలో నేత్రి పాలు, కాఫీ తీసుకుని బయటకు వెళ్తుంది. హాల్లో ఇంత మంది ఉంటే ఒక్కరికే కాఫీ తీసుకొచ్చావేంటని వల్లభ అడుగుతాడు. ఇందాక బాబయ్ ఒక్కరే ఉన్నారని నేత్రి చెప్పి పావణమూర్తికి కాఫీ ఇస్తూ.. పాపకు పాలు ఇస్తుంది. గాయత్రి పాప అనుమానంగా చూస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?