E-Paper
Advertisement

Honor 200 5G: ధర ఏమోగాని భయ్యా ఫీచర్లు మాత్రం చింపేసాయ్.. కెమెరా మాత్రం ఓ రేంజ్!

Honor 200 5G: ధర ఏమోగాని భయ్యా ఫీచర్లు మాత్రం చింపేసాయ్.. కెమెరా మాత్రం ఓ రేంజ్!

Honor 200 5G Launch In India Soon: చైనీస్ టెక్ బ్రాండ్ హానర్ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. బడా కంపెనీలకు పోటీగా అదిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తూ అదరగొడుతోంది. అయితే ఈ హానర్ కంపెనీ గత నెల జూన్‌లో Honor 200 5G సిరీస్‌ను చైనీస్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. అయితే త్వరలో భారత్‌లోనూ ఈ సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌లో లాంచ్ కాబోయే హానర్ 200 5జీ సిరీస్‌లో.. హానర్ 200, హానర్ 200 ప్రో వంటి మోడల్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ప్రస్తుతం లిస్ట్ చేయబడ్డాయి. ఇక వీటి ఫీచర్లు అండ్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Honor 200లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌గా ఇవ్వబడింది. అలాగే 200 Proలో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు OLED ఫుల్ HD+ స్క్రీన్‌ని కలిగి ఉంటాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5200 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Honor 200 అండ్ 200 Pro కోసం ల్యాండింగ్ పేజీ అమెజాన్‌లో లైవ్ పెట్టారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ గురించి ఎలాంటి సమాచారం అందులో పేర్కొనలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఇటీవల Honor 200 Pro మోడల్ నంబర్ ELP-NX9తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా MagicOS 8.0 పై రన్ అవుతాయి. ఇవి పూర్తి HD + (1,224 x 2,700 పిక్సెల్స్) స్క్రీన్‌ను కలిగి ఉంటాయి.

Also Read: ఫ్రంట్ కెమెరాతో హానర్ న్యూ స్మార్ట్‌ఫోన్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

ఈ సిరీస్ ప్రో మోడల్ 6.78 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్ 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ల విషయానికొస్తే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఒకరకంగా చూస్తే కెమెరా పరంగా ఫోన్ అదిరిపోయేటట్టు ఉంది. హై క్వాలిటీతో ఫొటోలు మాత్రం ఓ రేంజ్‌లో రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలోని 5200 mAh బ్యాటరీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

కాగా హానర్ నుంచి ఇటీవల మ్యాజిక్ 6 సిరీస్, మ్యాజిక్ V2 ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా MagicOS 8.0పై రన్ అవుతాయి. Qualcomm Snapdragon 8 Gen 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. హానర్ మ్యాజిక్ V2 RSR అనేది మ్యాజిక్ V2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పోర్షే డిజైన్ బ్రాండ్ వెర్షన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో LTPO OLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. హానర్ మ్యాజిక్ 6 ప్రోలో 180-మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్, మ్యాజిక్ 6లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. Honor Magic 6 5450 mAh బ్యాటరీని కలిగి ఉంది. Magic 6 Pro 5600 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags

Related News

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

Big Stories

×