భారతీయ రైల్వే మరో నోటిఫికేషన్ జారీ చేసింది. IRCTCలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ లో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నియామకాలను వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 18, 2025గా నిర్ణయించింది.
⦿ నియామక సంస్థ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)
⦿ పోస్టు పేరు: హాస్పిటాలిటీ మానిటర్
⦿ మొత్తం పోస్టులు: 64
⦿ జీతం: నెలకు ₹30,000
⦿ అధికారిక వెబ్‌సైట్: www.irctc.co.in
⦿ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ లో బి.ఎస్సీ డిగ్రీ.
⦿ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించిన ఇండియన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి బిబిఎ/ఎంబీఏ (క్యులినరీ ఆర్ట్స్) పట్టా.
⦿ బి.ఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్.
⦿ యుజిసి/ఎఐసిటిఇ/భారత ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచిఎంబీఏ (టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్).
⦿ 2024 కి ముందు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
⦿ దరఖాస్తు రుసుము: లేదు.
⦿ గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు
⦿ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ
⦿ అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా ఫిల్ చేయాలి.
⦿ ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లను చూపించడంతో పాటు జీరాక్స్ కాపీ సెట్, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.
⦿ మూడు రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకెళ్లాలి.
⦿ నవంబర్ 8, 2025 – IHMCT, త్రివేండ్రం (కేరళ) – G.V. రాజా రోడ్, కోవలం, త్రివేండ్రం – 695527
⦿నవంబర్ 12, 2025 – శేషాద్రి రోడ్, ఎంఎస్ బిల్డింగ్ దగ్గర, అంబేద్కర్ వీధి, బెంగళూరు, కర్ణాటక – 560001
⦿నవంబర్ 15, 2025 – సిఐటి క్యాంపస్, తమరాణి, చెన్నై – 600113
⦿ నవంబర్ 18, 2025 – తంజావూర్ రోడ్, తువకుడి, తమిళనాడు – 620015
⦿ దరఖాస్తు/ఇంటర్వ్యూకు చివరి తేదీ: నవంబర్ 8, 2025 నుంచి నవంబర్ 18, 2025 వరకు.
Read Also: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?