Ind vs aus 5Th T20I: ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య 5వ టీ-20 మ్యాచ్ ఇవాళ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పూర్తిగా జరుగలేదు. 4.5 ఓవర్ల మ్యాచ్ జరగ్గానే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దీంతో 4.5 ఓవర్లలో టీమిండియా 52 పరుగులు సాధించింది. మెరుపులు, వర్షం ప్రారంభం కావడంతో అక్కడికి ఆటను నిలిపివేశారు. ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్ లోకి పిలిచారు. వర్షం వెలిస్తే మ్యాచ్ ను కొనసాగించాలని భావించారు. కానీ వర్షం నిలిచిపోకపోవడం.. స్టేడియం అంతా బురదమయం కావడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.
Also Read : Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?
ప్రధానంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు భయంకరంగా ఉన్నట్టు సమాచారం. దీంతో చివరి టీ-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే మొదలైన వర్షం పెద్దదైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. తొలి టీ-20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. మూడు, నాలుగు టీ-20ల్లో టీమిండియా గెలవగా.. రెండో టీ-20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. ఈ మ్యాచ్ వర్షంతో రద్దు అయినప్పటికీ.. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ-20లలో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగుల మార్కు అందుకున్న ఆటగాడిగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ వరల్డ్ రికార్డును సాధించాడు.
ఆస్ట్రేలియాతో 5వ టీ-20 సందర్భంగా శనివారం నాటి మ్యాచ్ లో అభిషేక్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 19, 68, 25, 28 పరుగులు సాధించాడు. భారత్ తరపున ఇప్పటివరకు 28 మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ. 528 బంతుల్లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది. తొలి టీ-20, 5వ టీ-20 వర్షార్పణం కావడం గమనార్హం. చివరి మ్యాచ్ లో ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. తొలుత ఉరుములు, మెరుపులు రావడంతో ఆటను నిలిపివేశారు. ఆ తరువాత భారీ వర్షం కూడా తోడవ్వడం తో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read : Mohammed Shami : రూ .4 లక్షలు చాలడం లేదు నెలకు రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే..షమీ భార్య సంచలనం