iphones Stolen| ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లలో అత్యధికంగా విక్రయించబడే బ్రాండ్ ఐఫోన్. ఆపిల్ తయారు చేసే ఐఫోన్లంటే భద్రతకు మారు పేరు. కానీ ఇప్పుడు అదే ఆపిల్ కంపెనీ పెద్ద సమస్య వచ్చి పడింది. తరుచూ ఐఫోన్లు దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక ప్రముఖ నగరంలో అయితే 80000కు పైగా ఐఫోన్లు చోరీకి గురయ్యాయి. ఈ దొంగతనాలకు మరెవరూ బాధ్యలు కాదని అంతా ఆపిల్ కంపెనీ తప్పిదమేనని పోలీసులు చెబుతున్నారు.
లండన్ నగరంలో స్మార్ట్‌ఫోన్ దొంగతనాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే 80,000 కంటే ఎక్కువ ఐఫోన్లు దొంగిలించబడ్డాయి. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు సర్వీస్ ఈ సమస్యకు ఆపిల్ కంపెనీ కూడా బాధ్యత వహించాలని చెబుతోంది. యూకేలో దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసే ముఖ్యమైన డేటాబేస్‌ను ఆపిల్ లాంటి పెద్ద కంపెనీ ఉపయోగించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల ప్రకారం.. ఆపిల్ నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ అనే డేటాబేస్‌ను ఉపయోగించడం లేదు. ఇది దొంగిలించబడిన అన్ని ఫోన్ల వివరాలు ఉండే జాతీయ డేటాబేస్. ఈ భద్రతా లోపం వల్ల దొంగలు సులువుగా దొంగ ఐఫోన్లను ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌లో అమ్మేస్తున్నారు. ఆపిల్ షాపుల్లో ఈ ఫోన్లను చెక్ చేయకుండా స్టోర్ క్రెడిట్ ఇస్తోంది. దీని వల్ల దొంగలు ఈ ఫోన్లను సులువుగా విక్రయించేసి సొమ్ము చేసుకునే అవకాశం కలుగుతోంది.
ఈ దొంగతనాలు కేవలం సాధారణ దొంగలు మాత్రమే కాదు.. పెద్ద క్రిమినల్ గ్యాంగ్‌లు కూడా చేస్తున్నాయి. దొంగిలించిన ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే ఇదంతా పెద్ద స్థాయిలోనే జరుగుతోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐఫోన్స్ ఇంతటి స్థాయిలో ప్రజల భద్రతను ప్రభావితం చేస్తోంది
మీ ఐఫోన్ దొంగిలించబడితే వెంటనే చర్య తీసుకోండి. ముందు iCloudలో లాగిన్ అయి Find My iPhone ఆన్ చేయండి. Lost Mode ఆక్టివేట్ చేస్తే ఫోన్ లాక్ అవుతుంది. మీ కాంటాక్ట్ స్క్రీన్‌పై మెసేజ్ కనిపిస్తుంది.
రికవరీ అనుమానంగా ఉంటే “Erase iPhone” ఆప్షన్ ఉపయోగించండి. ఇది రిమోట్‌గా ఫోన్ లోని డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. ఫోటోలు, బ్యాంక్ యాప్‌లు, ప్రైవేట్ మెసేజ్‌లు సురక్షితమవుతాయి.
మీ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీకి కాల్ చేసి SIM కార్డ్ బ్లాక్ చేయించండి. ఇలా చేస్తే.. మీ నంబర్ దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. OTP కోడ్‌లు రాకుండా చేస్తుంది.
వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి దొంగతనం రిపోర్ట్ ఇవ్వండి. ఫోన్ IMEI నంబర్ ఇవ్వండి – ఇది బాక్స్‌పై లేదా సెట్టింగ్స్‌లో ఉంటుంది. భారత్‌లో CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేయించండి.
అన్ని ముఖ్యమైన అకౌంట్ల నుంచి లాగౌట్ అవ్వండి. బ్యాంక్, పేమెంట్ యాప్‌లు (Google Pay, Paytm), సోషల్ మీడియా, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు మార్చండి. ఈ జాగ్రత్తలతో మీ డబ్బు, గుర్తింపును కాపాడుకోండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే