BigTV English

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Honor 200 Lite: Honor పలు ఫోన్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రపంచ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అదరగొడుతోంది. ఇందులో భాగంగానే త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. అందులో Honor 200, Honor 200 Pro, Magic 7 Pro వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఈ ఫోన్లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కంపెనీ ఇప్పుడు ఈ లైనప్‌లో మరో ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేసేందుకు సిద్ధమైంది.


ఈ నెల అంటే సెప్టెంబర్ 19న భారతదేశంలో కంపెనీ తన మరో ఫోన్ Honor 200 Liteను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ అయిన అమెజాన్ మైక్రోసైట్‌లో వెల్లడయ్యాయి. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హానర్ 200 లైట్ ఫోన్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతుంది. అయితే త్వరలో భారత్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ ఫోన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఇక దీని ధర విషయానికొస్తే.. Honor 200 Lite రూ. 34,998 ప్రారంభ ధరతో భారతదేశంలోకి రానుంది. అయితే ఇది Honor 200 5G కంటే తక్కువ ధరలో వస్తుందని చెప్పుకోవచ్చు.


Also Read: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Honor 200 Lite Specifications

హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఐ ప్రొటెక్షన్ కోసం స్క్రీన్ 3240Hz హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే సేఫ్టీ కోసం ఇది సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా వంటివి ఉన్నాయి.

అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియోల కోసం 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అంతేకాకుండా ఇది ‘సెల్ఫీ లైట్’ని కూడా కలిగి ఉంటుంది. ఇక మన్నిక విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌కు SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ ఇవ్వబడింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, సియాన్ లేక్, స్టార్రీ బ్లూ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0పై రన్ అవుతుంది. ఇక ఈ ఫోన్ గ్లోబల్ వెర్షన్ విషయానికొస్తే.. ఈ ఫోన్ MediaTek Dimensity 6080 SoC చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్ సామార్థ్యానికి వస్తే.. ఇది 35W వైర్డ్ సూపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×