E-Paper
Advertisement

Siva Koratala: కోటిన్నర వాచ్.. దేవర హిట్ కాకముందే ఎన్టీఆర్ గిఫ్ట్.. ?

Siva Koratala: కోటిన్నర వాచ్.. దేవర హిట్ కాకముందే ఎన్టీఆర్ గిఫ్ట్.. ?
Advertisement

Siva Koratala:  శివ కొరటాల..  గత కొన్నిరోజులుగా  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.  ఆచార్య ప్లాప్ తరువాత  కొరటాల దేవర సినిమాతో హిట్ అందుకుంటాడా.. ? లేదా.. ? అని అభిమానులతో పాటు టోటల్ ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. అపజయమే ఎరుగని ఒక డైరెక్టర్ ను అధః పాతాళానికి తొక్కేసింది ఒక సినిమా. ఏ ముహూర్తాన కొరటాల.. ఆచార్య  సినిమాను మొదలుపెట్టాడో కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు కొరటాల ఆ ప్లాప్ నుంచి కోలుకోలేకపోతున్నాడు.

ఇక  కొరటాల కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్.. నేనున్నా అంటూ అండగా నిలిచాడు. వీరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమా రావడంతో నెక్స్ట్ సినిమా దేవర కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఇక ఇప్పటికే దేవర నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొంత నెగెటివిటీ వచ్చినా .. ఒక స్టార్ హీరో సినిమాకు ఇలాంటి నెగెటివ్ టాక్ నే మరింత హైప్ తీసుకొస్తుంది అని చెప్పొచ్చు.

Advertisement

Poonam Kaur: బ్రేకింగ్.. ఎట్టకేలకు త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసిన పూనమ్

ఇవన్నీ పక్కన పెడితే.. కొద్దిరోజుల నుంచి ఎన్టీఆర్ తో పాటు శివ కొరటాల కూడా దేవర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో  శివ కొరటాల పాల్గొన్నాడు. అయితే అక్కడ అందరి చూపు కొరటాల వాచ్ మీద పడింది.   ఆ వాచ్ ఏదో బావుందని కొంతమంది  దాని రేటు తెలుసుకోవడానికి ప్రయత్నించి షాక్ అయ్యారు. ఎందుకు షాక్ అవ్వడం.. ఏ లక్షనో.. రెండు లక్షల్లో ఉంటుంది అంతేగా అని అనుకుంటే పొరపాటే..  ఆ వాచ్ ధర అక్షరాలా.. కోటి 60 లక్షలు. పటేక్ ఫిలిప్ నాటిలస్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన ఈ వాచ్ ధర తెలిసి  అభిమానులు నోరు వెళ్లబెడుతున్నారు.

Advertisement

అదేంటి మావా .. ఆచార్య తరువాత కొరటాల అప్పుల పాలు అయ్యాడని, ఇల్లు, పొలం అమ్ముకున్నాడని వార్తలు వచ్చాయి. అంత గడ్డు పరిస్థితిలో ఉన్న కొరటాల .. ఇప్పుడు ఈ  రేంజ్ వాచ్  తో కనిపించడం ఏంటి అని నెటిజన్స్  ఆరాలు తీయడం మొదలుపెడుతున్నారు. ఇక కొంతమంది ఏమో..  ఇలాంటి ఖరీదైన వాచ్ లు అన్ని ఎన్టీఆర్ వాడుతుంటాడు. ఆయనే  కొరటాలకు గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు ఏమో అని చెప్పుకొస్తున్నారు.  దేవర సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదా.. ? ఆ డబ్బుతో కొన్నాడేమో ఎవరికి తెలుసు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ ఇప్పుడెందుకు సెప్టెంబర్ 27 న దేవర హిట్  అయితే ఓకే.. హిట్ కాకపోతే  కొరటాలను ట్రోల్ చేసేవారిని ఆపడం ఎవరితరం కాదు అన్నది మాత్రం వాస్తవం. మరి దేవర ఈ ఇద్దరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×