E-Paper
Advertisement

Honor 500 Launch: స్నాప్‌డ్రాగన్ 8, 200MP కెమెరా, 8000 mAh బ్యాటరీ.. మిడ్ రేంజ్ ధరలో హానర్ సూపర్ సిరీస్ లాంచ్

Honor 500 Launch: స్నాప్‌డ్రాగన్ 8, 200MP కెమెరా, 8000 mAh బ్యాటరీ.. మిడ్ రేంజ్ ధరలో హానర్ సూపర్ సిరీస్ లాంచ్
Advertisement

Honor 500 Launch| హానర్ కంపెనీ కొత్త Honor 500 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో హానర్ 500, హానర్ 500 ప్రో రెండు మోడల్స్ ఉన్నాయి. రెండు ఫోన్లు లేటెస్ట్ Android 16 + MagicOS 10 సాఫ్ట్‌వేర్‌తో వస్తున్నాయి. నాలుగు కలర్స్‌లో (ఆక్వామెరైన్, స్టార్‌లైట్ పింక్, ఒబ్సిడియన్ బ్లాక్, మూన్‌లైట్ సిల్వర్) అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు చూడగానే ప్రీమియం ఫీల్ కలుగుతుంది.

ధర, వేరియంట్ వివరాలు

హానర్ కొత్త సిరీస్ ఫోన్ల ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. హానర్ 500 సాధారణ మోడల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కేవలం CNY 2,699 (సుమారు రూ.34,000) మాత్రమే. 12GB + 512GB వేరియంట్ రూ.37,000, 16GB + 512GB వేరియంట్ రూ.41,400 ఉంటుంది. హానర్ 500 ప్రో మోడల్ 12GB + 256GB రూ.45,200 నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ 16GB + 1TB స్టోరేజ్ ₹60,300 వరకు వెళ్తుంది. చైనాలో ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

డిస్‌ప్లే

Advertisement

డిస్‌ప్లే రెండు ఫోన్లలోనూ సేమ్ డిస్‌ప్లే ఉంది. 6.55 అంగుళాల ఫుల్ HD+ LTPO OLED స్క్రీన్. దీని రిజల్యూషన్.. 1,264 × 2,736 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ బ్రైట్‌నెస్ అంటే.. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రాసెసర్ చిప్, కెమెరా

హానర్ 500 ప్రోలో సూపర్ పవర్‌ఫుల్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ ఎంత కష్టమైనా స్మూత్‌గా నడుస్తుంది. కెమెరా సెటప్ అదిరిపోతుంది. 200MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్), 12MP అల్ట్రా వైడ్ + మాక్రో కెమెరా. సెల్ఫీల కోసమైతే 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియోలు షేక్ అవకుండా OIS సపోర్ట్ ఉంది.

Advertisement

సాధారణ హానర్ 500లో Snapdragon 8s Gen 4 చిప్‌సెట్ ఉంది. రోజువారీ యూజ్ కోసం ఇది బెస్ట్. రియర్ (వెనుకవైపు) ప్రధాన కెమెరా 200MP + 12MP మాక్రో, ఫ్రంట్ కెమెరా 50MP. రెండు ఫోన్లలోనూ 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సాధారణ మోడల్‌లో అదనంగా 27W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ ఫోన్ కూడా ఛార్జ్ చేయొచ్చు!

డిజైన్

హానర్ కొత్తగా డిజైన్ చాలా స్లిమ్ చేసింది. కేవలం 7.8mm మందం, దీని బరువు 198 గ్రాములు మాత్రమే. బ్యాక్ ప్యానెల్ క్రిస్టల్ లాంటి ఫినిష్ ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ మెమరీ కార్డ్ స్లాట్ లేదు, కానీ అంత స్టోరేజ్ ఉంటే మెమరీ కార్డ్ అవసరం కూడా లేదు.

బ్యాటరీ

రెండింట్లోనూ 8,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం రెండు రోజులు సులువుగా నడుస్తుంది.

కనెక్టివిటీ ఫీచర్స్

రెండు ఫోన్లు 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సీ పోర్ట్ ఉంటాయి. డ్యుయెల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ మోడర్న్ కనెక్టివిటీని ఇస్తాయి.

మీకు భారీ బ్యాటరీ + టాప్ క్లాస్ కెమెరా + సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ కావాలంటే హానర్ 500 సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇండియాలో త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ చైనా ధరలు చూస్తే దేశంలో కూడా కాంపిటీటివ్ ధరల్లోనే వస్తుందని అంచనా. ఎవరైనా బ్యాటరీ బీస్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? Honor 500 సిరీస్ మీ కోసమే వచ్చేసింది!

Also Read: దొంగలను పట్టించే ఏఐ టెక్నాలజీ.. షావోమీ కొత్త డోర్ లాక్ వచ్చేసింది..

Also Read:  గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×