OTT Movie : ప్రేమ కథలు చూడటానికి చాలా చక్కగా అనిపిస్తాయి. అయితే దెయ్యాలు మనుషుల్ని ప్రేమించడం కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ సినిమాలో కథ ఇదే. హీరోని ఒక దెయ్యం లవ్ చేస్తుంది. ప్రియురాలి రూపంలో వెంటాడుతుంది. చివరకి దాని నుంచి హీరో బయట పడతాడా ? అనేది క్లైమాక్స్ లోనే తెలుస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఓటీటీలో అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఏసెక్’ 2023లో విడుదలైన హిందీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. సరిమ్ మోమిన్ దర్శకత్వంలో వర్ధన్ పూరి (రానీ), సోన్నాలి సేగల్ (లైల్), సిద్ధాంత్ కపూర్ (ప్రియాంకా ఎక్స్) లీడ్ రోల్స్ లో నటించారు. జియో స్టూడియోస్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమా, 2023 జూన్ 23 నుంచి Jio hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.
రానీ అనే అబ్బాయి లండన్‌లో ఉంటాడు. అక్కడ ప్రియాంకా అనే అమ్మాయి బాగా ప్రేమిస్తాడు. అయితే అతనితో ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో రానీ బాగా డీలా పడిపోతాడు. ఒక రోజు నైట్ క్లబ్‌లో అతనికి లైల్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. లైల్ చాలా సెక్సీగా ఉంటుంది. మొదటి మాటల్లోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడేసుకుంటారు. ఆ రోజు రాత్రే ఇద్దరూ ఒకరినొకరు క్లోజ్ అవుతారు. రానీకి లైఫ్ మళ్లీ కలర్‌ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే వింతలు మొదలవుతాయి. ఇంట్లో రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో గోడ మీద గోకుతున్నట్టు శబ్దాలు, మిర్రర్‌లో ఎవరో చూస్తున్నట్టు కనిపిస్తుంది. రానీ డ్రీమ్స్‌లో లైల్ రూపంలో ఒక భయంకరమైన ఫిగర్ వచ్చి నువ్వు నాకు మాత్రమే సొంతం అని చెప్తూ గొంతు పిసుకుతుంది. రానీ భయపడి తన ఎక్స్ ప్రియాంకాని అనుమానిస్తాడు. ఈమె బ్లాక్ మ్యాజిక్ చేసిందని అనుకుంటాడు.
Read Also : మిస్టీరియస్ బాక్స్ లో నుంచి బయటపడే దెయ్యం… ఈ హర్రర్ మూవీని ఒంటరిగా చూడాలంటే దమ్ముండాలి భయ్యా
అతని ఫ్రెండ్స్‌తో ఈ విషయం షేర్ చేసుకుంటాడు. వాళ్లు ఒక బాబా దగ్గరకు వెళతారు. బాబా వీళ్ళు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ ఇస్తాడు. నీ మీద ఒక జిన్ ఒబ్సెషన్ పెట్టుకుందని, అది లైల్ లో ప్రవేశించి కోరికలు తీర్చుకుంటోందని చెప్తాడు. ఈ జిన్ ప్రేమలో పడితే ఎవరినీ వదలదని, ఎవరు దగ్గరికి వెళ్తే వాళ్లని చంపేస్తుందని చెప్పడంతో ఇక అక్కడి నుంచి రియల్ హారర్ మొదలవుతుంది. ఆ జిన్ రానీ ఎక్స్ ప్రియాంకా చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్లే రాలేదని, నిజానికి లైల్‌ని రానీకి దగ్గర చేసినది ఆ జిన్‌యే నని తెలుస్తుంది. జిన్ లైల్ రూపంలో రానీని లవ్ చేస్తూ ఉందని తెలిసి చివరికి రానీ ధైర్యంగా జిన్‌తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆ డీల్ తో సమస్య తీరిపోతుందా ? రానీ జిన్ తో చేసిన డీల్ ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.