E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. తగలబడిన ఎలక్ట్రానిక్ షోరూం, ఘటన వెనుక కొత్త విషయాలు

Hyderabad News: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. తగలబడిన ఎలక్ట్రానిక్ షోరూం, ఘటన వెనుక కొత్త విషయాలు
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో ఈ ఘటన జరిగింది. సిలిండర్లు పేలిన శబ్దాలతోపాటు మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటన వెనుక అసలేం జరిగింది?

హైదరాబాద్‌లో తగలబడిన ఎలక్ట్రానిక్ షోరూం

Advertisement

హైదరాబాద్‌ పాతబస్తీలోని శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాల్ దర్వాజ్ ఎక్స్‌ రోడ్డు సమీపంలోని గోమతి ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. రెండు అంతస్తుల్లో ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్ ఉంది. అందులో గృహానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు పెద్ద ఎత్తున ఉన్నాయి.

వాటిలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత చిన్నగా మొదలైన మంటలు, ఆ తర్వాత షాపు అంతా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంటల ధాటికి రిఫ్రిజిరేటరల్లోని సిలిండర్లు బాంబుల మాదిరిగా పేలాయి. వాటి శబ్దం విని స్థానికులు హడలిపోయారు.

Advertisement

ఘటన వెనుక కారణాలపై లోతుగా దర్యాప్తు

ఎలక్ట్రానిక్స్‌ షోరూం వద్ద పార్క్‌ చేసిన ఓ కారు కాలిపోయింది. అందులోని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఫైర్ అధికారి వెల్లడించారు. ఓనర్ శివ కుమార్ 80 శాతం కాలిన గాయలతో డిఆర్డీఓ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.ఆయన పరిస్థితి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అందులో పని చేస్తున్నముగ్గురికి గాయాలు, చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.  మంటల ధాటికి ఆ షాపుకు ఇరువైపులా ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్స్ షాపుకి ‌పక్కనున్న బట్టల షాపులోకి మంటలు వ్యాపించాయి. అక్కడ భారీగా ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది.

ఈ ఘటన రాత్రి 10 గంటల నుంచి పదిన్నర మధ్యలో జరిగినట్టు షాపు యజమాని చెబుతున్నారు. బంధువుల ఫంక్షన్ ఉండడం వల్ల తాను వేగంగా షాపు క్లోజ్ చేసినట్టు చెబుతున్నాడు. సమీపంలోకి కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి ఘటన గురించి చెప్పడంతో తెలిసిందన్నాడు. కారు-టూ వీలర్ ఢీ కొట్టడంతో మంటలు వ్యాపించాయని, ఆ తర్వాత తమ షాపుకు అంటుకుని ఉంటుందని చెబుతున్నాడు.

ALSO READ: మాగంటి కుటుంబ వివాదం.. ఇవాళ ఎమ్మార్వో విచారణ

తాము ఇంటి నుంచి వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోయాడు. దాదాపు రెండు షాపుల్లో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలిపాడు. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేయాలని కోరాడు. పోలీసులు మాత్రం ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు.

ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్లు ఆ ప్రాంత డీసీపీ వెల్లడించారు. ప్రమాద సమయంలో అటువైపు వెళ్తున్న ఎర్రకుంటకు చెందిన జమీర్‌, ఆయన భార్య గాయపడ్డారు. పోలీసుల వెర్షన ఒకలా, బాధితుడి వెర్షన్ మరోలా ఉండడంతో అసలేం ఏం జరిగిందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×