E-Paper
Advertisement

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?
Advertisement

నేపాల్‌లో వరద విలయతాండవాన్ని చూసిన తర్వాత మీకు 2012 మూవీ గుర్తు వచ్చి ఉంటుంది. అందులో ఎవరెస్ట్ అంత ఎత్తులో సముద్రపు అలలు అల్లకల్లోలం సృష్టిస్తాయి. అయితే.. వాస్తవానికి అది సాధ్యం కాదు. అంటార్కిటికాలో ఉన్న మంచంతా కరిగినా.. నీరు ఎవరెస్టును తాకలేదు. కానీ, బంగ్లాదేశ్.. శ్రీలంక.. న్యూజిలాండ్.. జపాన్ వంటి దేశాలు కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పుడు సమస్య అంటార్కిటికాతో కాదు.. హిమాలయాలతో. ఆర్కిటిక్, అంటార్కిటిక్‌లను ఉత్తర, దక్షిణ ధృవాలని ఎలా పిలుస్తామో.. అలా హిమాలయాలను మూడో ధృవంగా పిలుస్తారు. భూమిపై ఉన్న మొత్తం మంచు నిల్వల్లో ఇక్కడ ఉన్నది 0.5 శాతం మాత్రమే. కానీ, ఇది కరిగితే.. నేపాల్, చైనా, ఇండియాలోని కొన్ని నగరాలను మాయం చేసేయొచ్చు.

హిమాలయాల్లో ఎంత మంచు ఉంది?

అంటార్కిటికాలో 27,000,000 ఘన కిలోమీటర్లు (Cubic Kilometers), ఆర్కిటిక్, గ్రీన్ ల్యాడ్‌లో 2,850,000 ఘన కిలోమీటర్ల మంచు ఉంటే.. హిందూకుష్, హిమాలయాల్లో 3 వేలు నుంచి 4 వేల ఘన కిలోమీటర్ల మంచు ఉంది.

ఘన కిలోమీటర్లంటే?

Advertisement

ఉదాహరణకు ఒక పెద్ద మంచు గడ్డ.. 20 కిమీల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు, 10 కిలోమీటర్ల ఎత్తు ఉన్నట్లయితే.. 20 x 20 x 10 = 4000 ఘన కిలోమీటర్లు. నేపాల్ వరదలో మంచుతో కలిసి ఏర్పడిన బురద పరిమాణం సుమారు 0.05 క్యూబిక్ కిలోమీటర్లు మాత్రమే. ఎత్తు నుంచి దిగువకు ప్రవహించడం వల్ల దానికి అంత శక్తి లభించింది. అదే 4 వేల ఘన కిలోమీటర్ల మంచు కరిగితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

హిమాలయాలు వేరు.. అంటార్కిటికా వేరు

హిమాలయాలు అంటార్కిటికా తరహాలో గడ్డకట్టిన సముద్రం కాదు. సుమారు 4 నుంచి 5 కోట్ల్ ఏళ్ల కిందట.. ఇండియన్ ప్లేట్.. ఆసియా ప్లేట్‌ను ఢీకొట్టినప్పుడు ఏర్పడిన రాతి పొరలు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో టేథిస్ సముద్రం (Tethys Sea) ఉండేది. ఇండియన్ పొర.. ఆ సముద్రం అడుగున ఉన్న రాతిపొరలను ఢీకొట్టింది. దీంతో టైటిస్ సముద్రం అడుగు భాగం పైకి నెట్టబడి పర్వతాలుగా రూపాంతరం చెందాలి. అందువల్లే హిమాలయాల్లో ఇప్పటికీ సముద్ర జీవుల శిలాజాలు కనిపిస్తుంటాయి. ఈ రాతి కొండలపై భారీ స్థాయిలో మంచు పెరుకుపోతుంది.

హిమాలయాల్లో ఎంత నీరు ఉండవచ్చు?

Advertisement

ఇక్కడ మంచు మొత్తం కరిగితే సుమారు 3.5 నుంచి 4 క్వాడ్రిలియన్ లీటర్లు (3500 లక్షల కోట్ల లీటర్లు) నీరుతో సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఆసియాలో ప్రవహిస్తున్న గంగా, సిందు, బ్రహ్మపుత్ర, యంగ్జీ వంటి ప్రధాన నదులన్నీ హిమాలయాల్లోనే ఉద్భవిస్తున్నాయి. వాటిలో ప్రధాన నదులన్నీ ఇండియాలోనే ఉన్నాయి. ఈ నీరు ఆసియాలోని దాదాపు 160 నుంచి 200 కోట్ల ప్రజలకు నీరు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతోంది.

హిమాలయాల్లోని మంచు మొత్తం కరిగిపోతే?

హిమాలయాల్లోని మంచు మొత్తం కరిగిపోవడం అనేది అసాధ్యం. ఒక వేళ అదే జరిగితే.. రిజల్ట్ చాలా భయానకంగా ఉంటుంది. మంచు మొత్తం నీరుగా మారి నదిలోకి ప్రవహించేప్పుడు.. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్, అస్సాం లోయల్లోకి చేరినప్పుడు 50 నుంచి 100 మీటర్లు (15 నుంచి 30 అంతస్తుల భవనం ఎత్తు) వరకు రాకాసి అలలు విరుచుకుపడతాయి. పట్నా, వారణాసి, ఢాకా వంటి నగరాలకు చేరుకొనేసరికి నీటి 5 నుంచి 15 మీటర్లు (సుమారు 2 నుంచి 5 అంతస్తుల భవనం ఎత్తు) ఉంటుంది. పరివాహక ప్రాంతంతోపాటు నగరాలన్నీ ముంచేస్తుంది.

ఏయే నగరాలకు ఎక్కువ ప్రమాదం

బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరం.. అత్యంత దిగువ ప్రాంతంలో ఉంది. ఈ నగరంలో 10-15 మీటర్ల ఎత్తు నుంచి వరద దూసుకెళ్తుంది. మొత్తం నగరం కనుమరుగు అవుతుంది. దాని తర్వాత అత్యంత ప్రమాదాన్ని చూసే నగరం.. కోల్‌కతా. గంగా డెల్టాలో ఉంటం వల్ల నగరంలో 5 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు నీరు నిలిచిపోతుంది. దాదాపు 80 నుంచి 90 శాతం నగరం తుడిచిపెట్టుకుపోతుంది. ముఖ్యంగా హౌరా బ్రిడ్జి మీద స్తంభాలు మాత్రమే పాక్షికంగా బయటకు కనిపిస్తాయి.

ఈ నగరాలకూ ప్రమాదమే, కానీ..

పట్నా, గౌహతి (గువాహటి) నగరాలు కూడా మునిగిపోతాయి. దాదాపు 70 నుంచి 80 శాతం నగరం మాయమవుతుంది. అటువైపు సింధూ నదీ తీరానికి దిగువున ఉన్న పాకిస్తాన్‌లోని కరాచీ నగరం 40 నుంచి 50 శాతం పాక్షికంగా దెబ్బతింటుంది. ఇక ఢిల్లీ, చండీగడ్ నగరాలకు పెద్దగా ప్రభావం ఉండదు. అయితే, ఢిల్లీలో యుమునా తీరంలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నగరం భారీ ముంపుకు గురవ్వుతుంది. ముఖ్యంగా తూర్పు ఢిల్లీలో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉండవచ్చు.

మొత్తం మంచు ఒకసారే కరగాలంటే.. ఏం జరగాలి?

మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హిమాలయాల్లో మంచు మొత్తం కరగడం అసాధ్యం. అక్కడ వేల సంఖ్యలో ఉన్న గ్లేసియర్లు, వందల మీటర్ల మందపాటి మంచుపొరలు ఒక్కసారిగా కరగాలంటే.. సాధారణ ఎండలు చాలవు. ఇందుకు 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అక్కడ నమోదు కావాలి. లేదా భారీ ఉల్కపాతం జరగాలి. భారీ భూకంపాలు ఏర్పడినా గ్లేసియర్స్ పగిలి వరదలు ఏర్పడవచ్చు. కానీ, పూర్తిగా మంచైతే కరగదు. కాబట్టి.. ఎలాంటి ఆందోళనా పెట్టుకోవద్దు. కేవలం మీ అవగాహన కోసం.. ఉదాహరణగా ఆయా నగరాలకు కలిగే ముప్పు గురించి వివరించాం.

Also Read: కైలాస పర్వతం.. ఇక్కడన్నీ అంతుచిక్కని మిస్టరీలే? ఇవి తెలిస్తే.. గూస్‌బంప్స్ పక్కా!

నోట్: కేవలం మీ అవగాహన కోసమే.. వివిధ పరిశోధనలు, అంచనాల ద్వారా ఈ ఆర్టికల్‌ను మీకు అందించాం. భయాందోళనలు సృష్టించడం మా ఉద్దేశం కాదు. హిమాలయాల్లోని మంచు లేదా గ్లాసియర్స్ పవర్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిపేందుకు.. ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు మా వంతు ప్రయత్నమని గమనించగలరు.

Tags

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×