BigTV English
Advertisement

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Linkedin  Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Linkedin Jobs : ఉద్యోగాన్వేషణ కోసం మంచి ప్రొఫైల్‌ను రూపొందించి జాబ్‌ సెర్చింగ్‌ వేదికల్లో అప్‌లోడ్‌ చేయడం తెలిసిన విషయమే. అందులో తమకు కావల్సిన ఉద్యోగం, జాబ్‌ అర్హతలు తదితర విషయాలను అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లో లింక్డ్ ఇన్ ముందు వరుసలో ఉంటుంది. చాలా మందికి ఈ లింక్డ్ ఇన్ గురించి తెలిసే ఉంటుంది. ఉద్యోగాన్వేషణ కోసం ఎక్కువ మంది ఈ ప్లాట్​ ఫామ్​నే అన్వేషిస్తుంటారు.


లింక్డ్ ఇన్ చాలా పెద్ద సోష‌ల్ మీడియా, జాబ్​ సెర్చింగ్​ ప్లాట్‌ఫామ్‌. ఫేస్ బుక్‌, ఇన్‌స్టా లాగా లింక్డ్ ఇన్ అకౌంట్​ను కూడా చాలా సులభంగా వినియోగించవచ్చు. అందుకే ఈ ప్లాట్​ ఫామ్​లో అకౌంట్ ఉండటం, కేవ‌లం ఉద్యోగుల‌కు మాత్ర‌మే కాదు ఫ్రీ ల్యాన్స‌ర్ల‌కు, బిజినెస్ ప‌ర్స‌న్ల‌కు ఎంతగానో ఉప‌యోగప‌డుతుంది. దీంతో ప్రతి ఒక్కరినీ ఇది బాగా ఆకట్టుకుంటోంది.

బిజినెస్​ను విస్త‌రించ‌డానికి కూడా ఈ లింక్డ్ ఇన్ బెస్ట్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ అని ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది. అలానే ఉద్యోగం మారాల‌నుకునేవారికి, కొత్త‌గా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించేవారికి, ముఖ్యంగా మ‌న రిలేటెడ్ పీల్డ్​కు సంబంధించిన జాబ్​ ప్రొఫెష‌న‌ల్స్‌తో ప‌రిచ‌యాలు పెంచుకునేందుకు, వారి ద్వారా ఉద్యోగం సంపాదించుకోవడం వంటివి మ‌రింత సుల‌భం అవుతుంది. అలానే త‌మలో ఉన్న ప్రతిభ, తెలిసిన టెక్నాల‌జీల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప‌బ్లిక్ ప్రొఫైల్‌లో ప్ర‌ద‌ర్శించ‌డం వల్ల, ఎంప్లాయిర్‌ల‌ను, కంపెనీ యాజమాన్యాన్ని బాగా ఆకర్షించ‌వ‌చ్చు.


అయితే ఈ లింక్డ్​ ఇన్​లో కేవలం అకౌంట్​ క్రియేట్ చేస్తే సరిపోదు. అందులో ప్రొఫైల్​ను కూడా ఆకర్షణీయంగా రూపొందించాలి. అప్పుడే మనం ఎదుటువారిని ఆకర్షించవచ్చు. అందుకే ఆకర్షణీయమైన ప్రొఫైల్​ తయారు చేసేందుకు కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకొచ్చాం. .

అసలు ప్రొఫైల్ అంటే ముందుగా టక్కున గుర్తుకొచ్చేది ఫొటో. ఇదే ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే సెల్ఫీలు, బర్ల్ ఫొటోలు, క్యాండిడ్ ఫొటోలు కాకుండా మంచి ప్రొఫైషన్ ప్రొఫైల్ ఫొటోను అప్లోడ్ చేయడం చాలా ముఖ్యం. అదే మీ ప్రొఫైల్ చూసేవారికి మొదటి ఇంప్రెషన్ ఇస్తుంది.

ALSO READ : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 రకాల సైజులలో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

కాబట్టి ప్రొఫైల్ ఎంత ప్రొఫైషనల్ ఉంటే అంత ఆకర్షణీయంగా రిక్రూటర్లకు బాగా కనిపిస్తుంది. అయితే ఎంచుకున్న రంగానికి అనుగుణంగా ప్రొఫైల్ ఉండటం మరింత ముఖ్యం అని గుర్తు పెట్టుకోవాలి. అలాగే దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేస్తుండాలి.

ఈ ప్రొఫైల్​లో మీ ఎక్స్​పీరియన్స్, స్కిల్స్​, ప్రస్తుతం చేస్తున్న పని వివరాలు గురించి స్పష్టంగా పేర్కొనాలి. ఇందుకోసం ముఖ్యమైన కీవర్డ్లను ఉపయోగించాలి. అప్పుడు అది మరింత మందికి చేరువ అవుతుంది.

అలానే ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆయా సంస్థల ప్రొఫైల్​ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆ సంస్థల్లో ఏవైనా ఓపెనింగ్స్ పడినప్పుడు, లేదంటే కంపెనీకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇంకా బడా కంపెనీల హెచ్​ఆర్​ మేనేజర్లు, రిక్రూటర్లను కూడా ఫాలో అవ్వాలి. ఇది మీ నెట్​వర్క్​ను పెంచుకొనేందుకు బాగా సాయపడుతుంది.

లింక్డ్​ ఇన్​ ఓపెన్ టు నెట్​వర్క్​ ఫీచర్​ను యాక్టివేట్ చేయాలి. దీంతో ఫలానా ప్రొఫైల్ ఉద్యోగాన్వేషణలో ఉందనే విషయం రిక్రూటర్లకు పక్కాగా తెలుస్తుంది.

లింక్డ్​ ఇన్​లో మీ టాలెంట్​ను నిరూపించుకునేందుకు, మీలో ఉన్నా సత్తా తెలిపేందుకు ఎప్పటికప్పుడు ఆర్టికల్స్​, పబ్లిష్ చేస్తుండాలి. అప్పుడు మీరు పని చేస్తున్న రంగంపై మీకున్న పట్టు, జ్ఞానం, దానిపై ఉన్న అభిరుచి కూడా రిక్రూటర్లకు తెలుస్తుంది. లింక్డ్ ఇన్​లోని ప్రొఫైషనల్ గ్రూప్లు జాయిన్ అవ్వాలి. అప్పుడు మీరున్న రంగంలోని కొత్త పోకడలు తెలుసుకునేందుకు కూడా ఇది సాయపడుతుంది.

Related News

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

OPPO A6 Pro Mobile: 7000 mAh భారీ బ్యాటరీతో ఒప్పో ఎంట్రీ.. ఏ6 ప్రో 5జి ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో ఇవే..

Vivo 400MP cameraphone: ప్రపంచంలోనే మొదటి 400MP కెమెరాఫోన్.. ఫొటోగ్రఫీ రంగంలో వివో సంచలన మోడల్

Samsung Galaxy F67 Neo 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సూపర్‌ హిట్‌ ఫోన్ ఎంట్రీ.. గెలాక్సీ ఎఫ్67 నియో 5జి స్పెషల్‌ ఫీచర్లు

Realme Narzo 50: రూ.15వేల లోపే బెస్ట్ 5జీ మొబైల్.. రియల్‌మీ నార్జో 50 5జీ పూర్తి రివ్యూ

Big Stories

×