BigTV English

Impact of Gas stove : గ్యాస్ స్టవ్‌ ఆరోగ్యానికి ప్రమాదకరం.!

Impact of Gas stove : గ్యాస్ స్టవ్‌ ఆరోగ్యానికి ప్రమాదకరం.!

Impact of Gas stove : తినే తిండి దగ్గర నుండి పీల్చే గాలి వరకు అన్నీ ఎప్పుడో కలుషితం అయిపోయాయి అని నేటి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మనం రోజూ ఉపయోగించే వస్తువులు కూడా ఏదో ఒక విధంగా మనకు హాని కలిగించేవే అని వారు చెప్తూనే ఉన్నారు. తాజాగా మన ఇంట్లో ముఖ్యమైన మరో వస్తువు కూడా కాలుష్యానికి కారణమవుతుందని వారు కనుగొన్నారు.


గ్యాస్ స్టవ్ వల్ల మన ఇంట్లోనే కాలుష్యానికి దారితీస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరీక్షల్లో తేలింది. ఇది గాలితో పాటు వాతావరణ కాలుష్యానికి దారితీస్తుందని వారు చెప్తున్నారు. అస్తమా లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి గ్యాస్ స్టవ్ మరింత ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ స్టవ్ వెలుగుతున్నప్పుడు మాత్రమే కాదు.. ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా కాలుష్యాన్ని విడుదల చేస్తాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ కాలుష్యం తక్కువ శాతంలోనే ఉన్నా కొన్నిసార్లు మాత్రం ఇది బయట ట్రాఫిక్‌తో కలిగే కాలుష్యంతో సమానమని తెలిపారు.

గ్యాస్ స్టవ్‌లు గాలి కాలుష్యానికి ఫ్రీ పాస్‌లాగా మారిపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్యాస్ స్టవ్‌లు తయారు చేసే కంపెనీలు వాటిలో ఉపయోగించే రసాయనం నేచురల్ అని చెప్పినా అది కాలుష్యానికి దారితీస్తుందని నిర్ధారణ అయ్యింది. మామూలుగా కాలుష్యం అంటే పెద్ద పరిశ్రమలు, ట్రాఫిక్ నుండే వస్తుందని అందరి భావన. కానీ గ్యాస్ స్టవ్ నుండి వచ్చే మంట కూడా కాలుష్యమే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


గ్యాస్ స్టవ్‌లో మిథేన్‌ను ఉపయోగిస్తారు. శాస్త్రవేత్తలు 53 స్టవ్‌లపై పరిశోధన నిర్వహించినప్పుడు ఇవన్నీ ఆఫ్ చేసున్నప్పుడు కూడా మిథేన్‌ను విడుదల చేస్తున్నట్టుగా వారు గమనించారు. ఇవి దాదాపు 5 లక్షల కారు నుండి వస్తున్న కాలుష్యంతో సమానమని వారు కనుగొన్నారు. అంతే కాకుండా గ్యాస్ స్టవ్‌కు ఉండే బర్నర్‌ను బట్టి అది ఎంత నైట్రోజన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది అనేది కూడా ముఖ్యమని ఆ కోణంలో కూడా వారి పరిశోధనలు మొదలుపెట్టారు.

వంటగది చిన్నగా ఉన్నప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ బయటికి వెళ్లే అవకాశం లేక అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బయట ఉండే నైట్రోజన్ డయాక్సైడ్ శాతం కంటే గ్యాస్ స్టవ్ ఉండే ఇళ్లల్లోనే దాని శాతం ఎక్కువగా ఉన్నట్టు వారికి తెలిసింది. నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల అస్తమా లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ స్టవ్ ద్వారా అస్తమా వచ్చే అవకాశాలు 42 శాతం ఉన్నట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, ప్రజలను ఊరికే భయపెడుతున్నారని గ్యాస్ కంపెనీలు మండిపడుతున్నాయి.

నైట్రోజన్ డయాక్సైడ్‌తో పాటు మరికొన్ని గ్యాస్ స్టవ్‌లు కార్బన్ మోనోక్సైడ్‌ను విడుదల చేస్తున్నట్టుగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఇది కూడా ఆరోగ్యానికి హానికరమే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలు అందరికీ ఒకేలా ఉంటాయని శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్పడం లేదు. కానీ గ్యాస్ స్టవ్ వల్ల ఆరోగ్య సమస్యల రిస్క్‌ను తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వంటగదిలో వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని సలహా ఇస్తున్నారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×