BigTV English

NBK: బాలయ్యా.. నోరు అదుపులో పెట్టుకోవయ్యా! పిల్లలతో చెప్పించుకోకయ్యా!!

NBK: బాలయ్యా.. నోరు అదుపులో పెట్టుకోవయ్యా! పిల్లలతో చెప్పించుకోకయ్యా!!

NBK: నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ లో మోస్ట్ వెరైటీ పర్సనాలిటీ. ఫ్యాన్స్ అంతా బాలయ్య బాబును గుండెల్లో పెట్టుకుంటారు. జై బాలయ్య.. నినాదాలతో పూనకాలు తెప్పిస్తారు. బాలకృష్ణ సైతం ప్రేక్షక దేవుళ్లంటూ వాళ్లకి అంతే గౌరవం ఇస్తుంటారు. కానీ, అప్పుడప్పుడు చెంప పగలగొడుతుంటారు.


అంత ఏజ్ లోనూ ఇప్పటికీ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు. ప్రతీ సినిమాలో.. అన్నిపాటల్లో.. యమ స్పీడ్ గా డ్యాన్స్ చేస్తుంటారు. ఇక పవర్ ఫుల్ డైలాగులు, తొడగొట్టడాలు, కత్తి పట్టడాల్లో ఆయనకు ఆయనే సాటి. సినిమాల్లో మాదిరే రియల్ లైఫ్ లోనూ బాలయ్యకు దూకుడెక్కువ.

బాలయ్య ప్రసంగాల మీద ఉన్నన్ని కాంట్రవర్సీలు మరెవరి మీదా ఉండవు. దేవుళ్లు, వేదాలు, పురాణాలు, అన్నగారు.. ఇలా దేనిమీదైనా అనర్గలంగా మాట్లాడతారు. మాటకు ముందు.. మాట వెనకాల.. ఆ రోజుల్లో.. నాన్నగారు.. అనకుండా మాత్రం మాట్లాడలేరు. అయితే, ఇటీవల ఆ రిపిటేషన్ వర్డ్స్ ను బాగానే తగ్గించుకున్నారు. ఇదివరకటి సుత్తి కాస్త తగ్గింది. కాంట్రవర్సీ మాత్రం అలానే కంటిన్యూ అవుతోంది.


గడిచిన రెండు వారాల్లో రెండు కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారు బాలయ్య బాబు. దేవాంగుల గురించి మాట్లాడి ఆ వర్గం నుంచి నిరసన ఎదుర్కొన్నారు. ‘దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ’ అనడంతో ఆ వర్గమంతా భగ్గుమంది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని.. సంక్రాంతి రోజు దేవాంగులకు పరోక్షంగా క్షమాపణలు చెప్పారు.

ఇక, వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లోనూ మళ్లీ నోరు పారేసుకున్నారు. ఈసారి మాత్రం ఆయన నోరు బాగానే అదుపు తప్పినట్టుంది. ‘‘ఓ ఆర్టిస్ట్‌తో కలిసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్లం. వేదశాస్త్రాలు, నాన్నగారి డైలాగులు.. ఆ రంగారావు.. అక్కినేని తొక్కినేని.. ఇలా అన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్లం’’ అని అన్నారు. ఇదే ఇప్పుడు రచ్చకు దారి తీసింది. అక్కినేని అంతటి వారిని పట్టుకొని అక్కినేని తొక్కినేని.. అనడమేంటనేదే ప్రస్తుత వివాదం.

నిజమే. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు స్నేహంగా ఉండేవారు. రెండు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉండేది. సినిమాల విషయంలోనూ ఓ అండర్ స్టాండింగ్ తో వ్యవహరించేవారు. అలాంటిది.. ఎన్టీఆరే అంతలా అభిమానించిన అక్కినేని నాగేశ్వరరావు గురించి అక్కినేని తొక్కినేని లాంటి పదాన్ని వాడటం బాలయ్య నోటి దూలే.. అని మండిపడుతున్నారు.

లేటెస్ట్ గా అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం ట్విటర్ వేదికగా బాలకృష్ణను పద్దతిగా తప్పుబట్టారు. ‘‘నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనం కించపరుచుకోవడమే’’ అంటూ ట్వీట్ చేశారు.

పిల్లలతో అనిపించుకోవడం కాకపోతే ఇంకేంటి? ఇదంతా ఏంటి బాలయ్యా? అక్కినేనిని అలా అనటం తగునా? అన్ స్టాపబుల్ నుంచి NBK బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరుగుతుంటే.. ఇప్పుడిలా కాంట్రవర్సీ కామెంట్లతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం ఏంటి? బాబూ బాలయ్యా.. ఇకనైనా కాస్త నోరు అదుపులో పెట్టుకోవయ్యా.. అంటున్నారు బాలయ్య శ్రేయోభిలాషులు. అయితే, బాలయ్య బాబు ఏదో ఫ్లోలో అలా అన్నారేమో గానీ.. అలా అనడం తప్పేగానీ.. ఆయనకు అక్కినేనికి కించపరిచే ఉద్దేశం మాత్రం ఉండదు అంటున్నారు.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×