Infinix Note 40X 5G Launched: టెక్ బ్రాండ్ Infinix నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix Note 40X 5G భారతదేశంలో లాంచ్ అయింది. మిడ్-రేంజ్‌లో విడుదలైన ఈ Infinix స్మార్ట్‌ఫోన్‌లో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంది. ఇది 108 MP ట్రిపుల్ AI కెమెరాను కలిగి ఉంది. 12 GB వరకు RAM అందుబాటులో ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Infinix Note 40X 5G Price
Infinix Note 40X 5G రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అందులో 8GB + 256GB మోడల్ ధర రూ. 13,499గా ఉంది. అలాగే 12 GB + 256GB మోడల్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Note 40X 5Gని ఆగస్ట్ 9 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇది రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మల్టీగ్రేడియంట్ ఫినిషింగ్‌తో లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
Also Read: ఇవి కదా ఫోన్లంటే.. ఫీచర్లలో ఏ డోకాలేదు.. బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువకే..!
Infinix Note 40X 5G Specifications
Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ 6.78 FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 60, 90, 120Hz వరకు రిఫ్రెష్ రేట్లకు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే 500 నిట్‌ల బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. Infinix Note 40X 5G ఫోన్ 108MP AI ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. కెమెరా యాప్ 15 కంటే ఎక్కువ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యుయల్ వీడియో, సూపర్ నైట్, ఫిల్మ్ మోడ్ మొదలైనవన్నీ ఉన్నాయి. ముందు భాగంలో ఇది 8 మెగాపిక్సెల్స్, వైడ్ సెల్ఫీ మోడ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
Infinix Note 40X 5Gలో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంది. ఇది గరిష్టంగా 12 GB RAM + 256 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది 18-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. Infinix Note 40X 5Gలో డ్యూయల్ స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లు, ఫేస్ అన్‌లాక్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.