Vivo X300 Pro vs iPhone 17 Pro| ఒక పెద్ద కెమెరా ఫ్లాగ్‌షిప్ పోటీ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఉన్న టాప్ ఫొటోగ్రఫీ మాస్టర్ ఫోన్ వివో X200 ప్రోకు అప్‌గ్రేడ్ వెర్షన్ వివో X300 ప్రో చైనాలో ఇటీవలే విడుదలైంది. త్వరలోనే భారత్‌లో కూడా లాంచ్ అవుతుంది. ఈ కెమెరా కింగ్ నేరుగా ఐఫోన్ 17 ప్రోకు సవాలు విసిరింది. రెండు ఫోన్‌లు ఫోటోగ్రఫీపై ఎక్కువ ఫోకస్ చేసే విధంగా తయారు చేయబడ్డాయి. కానీ కెమెరా విధానాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ పోలికలో వాటి లెన్స్ ల గురించి ముఖ్య స్పెసిఫికేషన్‌లను వివరంగా తెలుసుకుందాం.
రెండు ఫోన్‌లలో ట్రిపుల్-కెమెరా సిస్టమ్ ఉంది. వివో X300 ప్రో మెయిన్ కెమెరా జీస్ ఆప్టిక్స్‌తో పార్ట్‌నర్‌షిప్ చేసుకుంది. ఇది శాంసంగ్ HPB సెన్సార్‌తో 200 మెగాపిక్సెల్ డీటెయిల్స్‌ను ఇస్తుంది. ఈ సెన్సార్ అతి డీటెయిల్డ్ ఫొటోస్, జూమ్‌ను అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో ప్రైమరీ సెన్సార్ 48 మెగాపిక్సెల్ డీటెయిల్స్‌ను ఫోటో తీస్తుంది. ఆపిల్ గత కొన్ని జనరేషన్‌లుగా ఈ సెన్సార్‌ను ఉపయోగిస్తూ.. చాలా నేచురల్ ఫోటోలు, మంచి బ్లర్ ఎఫెక్ట్‌లతో మెరుగుపరిచింది.
ఐఫోన్ 17 ప్రోలో కొత్త 4x టెలిఫోటో లెన్స్ ఉంది, ఆపిల్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీతో 8x లాస్‌లెస్ జూమ్‌తో వీడియో, ఫొటో తీస్తుంది. వివో X300 ప్రో 200MP మెయిన్ సెన్సార్ రిజల్యూషన్ వల్ల అద్భుతమైన జూమ్ సెటప్‌ను కలిగి ఉంది. ఈ టెక్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడల్ X200 ప్రో జూమింగ్‌లో బాగా పనిచేసింది, కాబట్టి X300 ప్రో కూడా అదే స్థాయి కొనసాగుతుందని ఆశ. కానీ రియాలిటీ టెస్ట్‌లో ఎవరు మెరుగ్గా ఉంటారో చూద్దాం.
ఐఫోన్ 17 ప్రో అల్ట్రావైడ్ కెమెరా 48MP సెన్సార్‌తో పనిచేస్తుంది. ఇది మాక్రో షాట్స్‌కు తక్కువ దూరంలో చిన్న వస్తువులను ఈజీగా తీసుకోగలదు. వివో X300 ప్రో అల్ట్రావైడ్ లెన్స్ శాంసంగ్ యొక్క కొత్త 50MP JN1 సెన్సార్‌తో ఉంది – మునుపటి మోడల్ కంటే మెరుగైనది. సెల్ఫీలకు వివో కూడా 50MP JN1 సెన్సార్‌ను ఉపయోగిస్తుంది, హై-రిజల్యూషన్ ఫ్రంట్ ఇమేజ్‌లను అందిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో ఫ్రంట్ కెమెరాకు పెద్ద అప్‌గ్రేడ్ తీసుకొచ్చింది – కొత్త 18MP స్క్వేర్ సెన్సార్‌తో, పోర్ట్రెయిట్ మోడ్‌లో ల్యాండ్‌స్కేప్ వీడియోలు తీసుకోవచ్చు, ఫోన్‌ను తిప్పాల్సిన అవసరం లేదు. ఈ కెమెరా పోస్ట్-ప్రొడక్షన్ ఎడిటింగ్‌లో మరిన్ని ఆప్షన్‌లను అందించే ప్రొరెస్ లాగ్ రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్లకు ఐఫోన్ ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది.
వివో X300 ప్రో, ఐఫోన్ 17 ప్రో రెండూ 8K, RAW వీడియో రికార్డింగ్‌తో అడ్వాన్స్ వీడియో ఫీచర్‌లను అందిస్తాయి. వివో X300 ప్రో మొదటి ఫోన్‌గా ఈ ప్రొఫెషనల్ ఆప్షన్‌లను అందించింది. ఐఫోన్ 17 ప్రో ప్రొరెస్ RAW రికార్డింగ్‌తో ఈ ఫంక్షనాలిటీని ముందుకు తీసుకెళ్తుంది. కలర్ గ్రేడింగ్ కోసం విస్తృత డీటెయిల్స్‌ను క్యాప్చర్ చేస్తుంది. అయితే, ప్రొరెస్ RAW ఫైళ్లు డివైస్ స్పేస్‌ను ఎక్కువగా తీసుకుంటాయి.
ఐఫోన్ సినిమాటిక్ వీడియో మోడ్‌ను ఈ ఫోన్‌లో కొనసాగిస్తుంది. 4Kలో 120 FPSతో స్లో మోషన్, ఫాస్ట్ ప్లేబ్యాక్ ఆప్షన్‌లతో. వివో X300 కూడా 4Kలో 120 FPSను క్యాప్చర్ చేస్తుంది. చాలా మంది వినియోగదారులకు రెండు డివైస్‌లు అసాధారణ వీడియో క్వాలిటీని అందిస్తాయి. ప్రొఫెషనల్స్ ఐఫోన్ ప్రొరెస్ RAW ఫీచర్‌తో హై-రిజల్యూషన్ వీడియోలు తీయడంలో ప్రయోజనం పొందుతారు.
మీ నిర్ణయం మీ విలువలపై ఆధారపడి ఉంటుంది. హై మెగాపిక్సెల్ సెన్సార్ కోసం వివో X300 ప్రోను ఎంచుకోండి. ఇది హై-మెగాపిక్సెల్ ఫోటోలు, హార్డ్‌వేర్ ఆధారిత జూమ్ స్థిరమైన ఫలితాలను అందిస్తుంది. వీడియో, సెల్ఫీలు తీయాలంటే ఐఫోన్ 17 ప్రోను ఎంచుకోండి. ఇది ప్రొఫెషనల్ వీడియో ఫార్మాట్‌లలో రికార్డ్ చేస్తుంది. వర్సటైల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. రెండు డివైస్‌లు.. ఫొటోగ్రఫీ ఫ్యాన్స్‌కు ప్రీమియం కెమెరాలు.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే