Genelia Birthday Special: నవ్వుకి బ్రాండ్ అంబాసిడర్ ఆబ్యూటీ.. ఆమె పేరు పలికితే చాలు ఆటోమేటిగ్ నవ్వొచ్చేస్తుంది. కావాల్సిన అందం, అంతకు మించి చలాకిదనం ఆ చిన్నదాని సొంతం.
ప్రస్తుతం ఫీల్డ్ లో లేదు కానీ.. ఆమె చిందించిన నవ్వులు మాత్రం నవ్విస్తూనే ఉన్నాయి. తెలుగుతెర హాసిని.. కాదు.. కాదు.. హ..హ హాసిని పుట్టిన రోజు నేడు.
“వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ” ఈ డైలాగులు తెలుగునాట ఎంత పాపులర్ అయ్యాయో. దాని పలికిన బ్యూటీ కూడా అంతే పాపులర్ ఆమె ఎవరో కాదు.. జెనీలియా.
ఆకట్టుకునే అందం, దానితో పోటీ పడే క్యూట్ క్యూట్ అల్లరి జెనీలియా సొంతం. ఆ చలాకితనమే ఆమెను ప్రేక్షకులకు కనెక్ట్ చేసింది. ఇంకా చెప్పాలంటే టీనేజ్ అమ్మాయిలు తమలో ఆమెను చూసుకొని మురిసి పోతూ ఉంటారు. అంతలా మెస్మరైజ్ చేసింది జెనీలియా.
హీరోయిన్స్ గా తెరపై అందాల సందడి చేసిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు గానీ అల్లరి పిల్లలా ఆకట్టుకున్న వారు చాలా తక్కువ. ఆ ప్లేస్ జెనీలియా పర్ఫెక్ట్ గా బర్తీ చేసింది.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసింది ఈ చిన్నది. కానీ ఎక్కువగా ఆకట్టుకున్నది మాత్రం తెలుగులోనే అని చెప్పాలి.
టాలీవుడ్ లో “సత్యం” సినిమాతో మొదలైంది జెనీలియా జర్నీ. తొలి సినిమాతోనే ఆడియన్స్ ను తెగ ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆపై స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఎన్టీఆర్ మొదలు, నితిన్ , రామ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, హిందీలోను స్టార్ హీరోయిన్స్ లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది జెనీలియా.
సత్యం తర్వాత సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్ లాంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక దశలో వెలిగిపోయింది.
తెలుగులో 10ల సంఖ్యంలో సినిమాలు చేసిన ఎక్కువగా ఆడియన్స్ మదిలో ముద్రించుకుపోయిన సినిమా మాత్రం “బొమ్మరిల్లు” అనే చెప్పాలి.
హ..హ. హాసిని జెనీలియా చిలిపితనాన్ని ఇప్పటికి ఎవరు మర్చి పోలేము. ఆమె సందడి చూసి తెలుగు కుర్రకారు తమ డ్రీమ్ గాళ్ ఇలాగే ఉండాలి అన్నట్టు గా కోరుకునే వారు ఆరోజుల్లో..
దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో సడెన్ గా మ్యారేజ్ చేసుకుని షాక్ ఇచ్చింది జెనీలియా.
హిందీలో తాను తొలిసారిగా నటించిన “తుఝే మేరీ కసమ్” తో పరిచయమైన బాలీవుడ్ స్టార్ హీరో రితీష్ దేశ్ ముఖ్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది.
పెళ్ళి తర్వాత దాదాపు సినిమాలకు దూరమైంది. పూర్తిగా తన సమయాన్ని కుటుంబాన్ని కేటాయించింది. మధ్య మధ్యలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన పూర్తి స్థాయిలో మాత్రం సినిమాలు చేయలేదు.