HMT Swarnapuri : హైదరాబాద్ మియాపూర్‌లో ప్లాట్ ఓనర్లు రోడ్డు ఎక్కారు. HMT స్వర్ణపురి కాలనీలోని అర్బన్ రైస్ గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ ఓనర్ల ధర్నా నిర్వహించారు. తమకు తమ పిల్లలకు భద్రతా లేదంటూ ఆందోళన చేపట్టారు. అర్బన్ రైస్ నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు పోతున్నాయంటూ ఆరోపించారు. ఈ నెల ఇద్దరు పిల్లల మృతికి యాజమాన్యమే కారణం అంటూ ప్లాట్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల మృతి పై స్పందించని అర్బన్ రైస్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలన్నారు. మాయమాటలు చెప్పి ప్లాట్‌లు అమ్మరంటూ బాధితులు ఆరోపించారు. ఎలాంటి ఎమినిటీస్ లేవని ప్లాట్ యజమానులు రోదిస్తున్నారు. బాధితుల నుంచి దాదాపు రూ. 5 కోట్లు అడ్వాన్స్ రూపంలో వసూలు చేశారని ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.