కానీ ఇక్కడ పప్పులు ఉడకలేదు. చివరికి మూడో టెస్టులో గెలిచింది. అయినా సరే.. ఈ సిరీస్ ను 2-1 తేడాతో కోల్పోయింది. ఇక లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక అటు బౌలింగు, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటా అద్భుతంగా ఆడింది.
వివరాల్లోకి వస్తే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్ చేసి 263 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇంగ్లండ్ కు 62 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ని శ్రీలంక బౌలర్లు అద్భుతంగా కట్టడి చేసి 156 పరుగులకే ఆలౌట్ చేశారు.
Also Read: టెస్టులో పంత్ రీ ఎంట్రీ..గంగూలీ ఏమన్నారంటే?
ఇలా 219 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 40.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా అజేయ శతకంతో లంకకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నిసాంకా కళ్లు చెదిరే శతకం సాధించాడు. 124 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 127 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఏదైతే ఇంగ్లండ్ బజ్ బాల్ క్రికెట్ అని అంటుందో.. అదే ఆటతో నిస్సాంక వారిని ఎదురుదెబ్బ తీశాడు. ఈ ఆట తీరుతో టెస్టు క్రికెట్ ఆట స్వరూపాన్నే ఇంగ్లండ్ మార్చేసింది. ఐదురోజులు జరగాల్సిన ఆటను నాలుగు లేదా మూడు రోజులకి కుదించేసిన జట్టుకి గట్టిగా బదులిచ్చాడు. చెడపకురా చెడేవు..అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మూడో టెస్టు నాలుగురోజుల్లో ముగిసింది. అది కూడా మొదటి సెషన్ లోనే పూర్తయ్యింది.