iQOO Z9 Turbo+ Specifications: టెక్ బ్రాండ్ ఐక్యూ రోజు రోజుకూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు అందుకుంటుంది. ముఖ్యంగా ఐక్యూ సామాన్యులకు అందుబాటు ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేసి అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ప్రీమియం ఫోన్లను కూడా రిలీజ్ చేసి అదరగొట్టేస్తుంది. ఇటీవలే తన లైనప్‌లో ఉన్న ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు మరొక ఫోన్ ‘iQOO Z9 Turbo+’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
తాజాగా iQOO తన Weibo హ్యాండిల్‌లో రాబోయే iQOO Z9 Turbo+కి సంబంధించిన మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పూర్తిగా వెల్లడించింది. అయితే దాని లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించిన వివరాలను ఒక టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీక్ చేశారు. దాని ప్రకారం.. Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో అంటే ఈ నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు.
iQOO Z9 Turbo+ Design
Also Read: ఆఫర్ల జాతర.. స్మార్ట్‌ఫోన్లు, టీవీ, ఎయిర్‌పాడ్స్‌పై భారీ తగ్గింపు, వదిలారో మళ్ళీ రావు!
iQOO Z9 Turbo+ డిజైన్ విషయానికొస్తే.. ఈ ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్‌ప్లే ఉందని విడుదలైన టీజర్‌లో కనిపిస్తుంది. దాని వెనుక భాగంలో స్విర్ల్ కెమెరా ఉంది. ఇందులో రెండు కెమెరాలు ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ పక్కన డ్యూయల్-టోన్ LED ఫ్లాష్ ఉంది. Z9 Turbo+ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ దాని కుడి వైపున ఉన్నట్లు కనిపిస్తుంది. ఫోన్ డిజైన్ iQOO Z9 Turboని పోలి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్‌తో ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో ప్రారంభించబడింది.
iQOO Z9 Turbo+ Specifications
కొన్ని నివేదికల ప్రకారం.. iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా MediaTek Dimension 9300 Plus చిప్‌సెట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందించబడుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీతో అమర్చబడుతుంది. సేఫ్టీ కోసం ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడుతుంది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OriginOS 4లో రన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ర్యామ్ + స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఇంకా వెల్లడి కాలేదు.
iQOO Z9 Turbo+ Price
iQOO Z9 Turbo+ ధర విషయానికొస్తే.. iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ దాదాపు 2000 యువాన్లు (సుమారు రూ. 23,502) ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.