BigTV English

Jagan Return: తాడేపల్లికి జగన్.. బోట్ల ఘటనపై కౌంటర్ ప్లాన్.. ఆ తర్వాతే ఫారెన్ టూర్?

Jagan Return: తాడేపల్లికి జగన్.. బోట్ల ఘటనపై కౌంటర్ ప్లాన్.. ఆ తర్వాతే ఫారెన్ టూర్?

Jagan Return: కాలం కలిసి రాకపోతే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ పరిస్థితి కూడా అంతే. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం నుంచి పర్మీషన్ తెచ్చుకున్నా, వెళ్లలేని పరిస్థితి ఆయనది. బుధవారం తీర్పు తర్వాతైనా యూకెకు వెళ్తారా? లేదా అన్న డౌట్ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటాడుతోంది.


పాస్‌పోర్టు సమస్య వల్ల మాజీ సీఎం జగన్ యూకె టూర్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ వ్యవహారంపై బుధవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నా రు. ఈనెల ఆరున తాడేపల్లి నేరుగా బెంగుళూరు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు.

ALSO READ: బలహీన పడిన వాయుగుండం.. ఈ జిల్లాలపై ప్రభావం ?


రీసెంట్‌గా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం జైలులో కలవనున్నారు అధినేత జగన్. ఇదే కేసులో అరెస్టయిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డితో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బెజవాడ వరదలు, బోట్ల వ్యవహారంపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై జగన్ క్లారిటీ ఇస్తారని అంటున్నాయి. ఈ వ్యవహారంలో పార్టీకి డ్యామేజ్ బాగానే అయ్యిందని భావిస్తున్నారు జగన్. అనంతరం ఆయన యూకెకు వెళ్తారని అంటున్నాయి పార్టీ వర్గాలు. సెప్టెంబర్ మూడు నుంచి 25 వరకు యూకెకు వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం నుంచి అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. పాస్‌పోర్టు సమస్య వల్ల ఏడెనిమిది రోజులైనా ఇంకా వెళ్లలేదు.

యూకె వెళ్లి వచ్చిన తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తున్నారట అధినేత జగన్. గత ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యనేతలుగా ఉన్నవారిని పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.  మిగతా వారికి పార్టీ పదవులు అప్పగించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల మాట. చాలామందికి పార్టీ పదవులు అప్పగించారు. కొందరికి జిల్లాలు, మరికొందరిని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. టూర్ తర్వాత మిగతావి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Related News

Indrakiladri temple: విజయవాడ దుర్గమ్మ భక్తులకు షాక్.. కొత్త రూల్ పాటించాల్సిందే!

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!

Fire accident: వినాయక చవితి వేడుకల్లో అగ్నిబీభత్సం.. ప్రాణనష్టం తప్పి ఊపిరి పీల్చుకున్న భక్తులు.. ఎక్కడంటే?

YS Jagan: వాళ్లు ఫోన్ చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు.. పార్టీ నేతలపై జగన్ ఫైర్!

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Big Stories

×