AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునే బలం లేదు. కేవలం 11 సీట్లకే పరిమితమవుతున్న ఆ పార్టీ ప్రతిపక్ష హోదా డిమాండ్ తో అసెంబ్లీకి డుమ్మా కడుతూ వస్తుంది. కానీ బలం ఉన్న శాసన మండలికి మాత్రం వైసీపీ హాజరవుతుంది. మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఉన్నారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బొత్సా వైఖరి జగన్‌కు ఇబ్బంది పెట్టేలా తయారయిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. అసలు శాసన మండలి వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ నిర్ణయాలను కాదని బొత్స అనుసరిస్తున్న ఆ వ్యూహం ఏంటి?
జగన్‌ను ఇబ్బంది పెట్టేలా బొత్స వ్యవహరిస్తున్నారని టాక్
వైసీపీ పెద్దల్లో శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహార శైలిపై చర్చ జరుగుతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీరు జగన్‌ను ఇబ్బంది పెట్టేలా ఉందని వైసీపీ నేతలే అంటున్నారట. ఉద్దేశపూర్వకంగా జగన్‌కు సమస్యలు సృష్టించేందుకు బొత్సా కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్నారట. శాసన మండలిలో చోడ్ చేసుకున్న పరిణామాలే దానికి నిదర్శనంగా భావిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ సంస్కరణల విషయంలో వైసీపీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది.
మండలిలో జీఎస్టీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించిన బొత్స
జగన్ జీఎస్టి సంస్కరణలపై ఆహో ఓహో అని ట్వీట్ చేశారు. కానీ బొత్స మండలిలో జీఎస్టీ అమలు విషయంలో కేంద్రాన్ని ప్రశంసిస్తూ చేస్తున్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారట. సభలో ఆయన జీఎస్టి తీర్మానానికి అనుకూలంగా స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వ్యతిరేకించబోతున్నారని తెలిసి పైనుంచి ఒత్తిడి రావడంతో వ్యతిరేకించలేదంటున్నారు. అలాగని బొత్సా సత్యనారాయణ తీర్మానాన్ని సమర్ధించలేదు. చివరికి బయటకి వచ్చిన ఆయన ఇడ్లీ దోసలపై జీఎస్టి క్లాటీ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడంతో ఆ కథ ముగిసినట్లయిందట.
బొత్స తీరుతో ఇబ్బంది పడుతున్న వైసీపీ నేతలు
ఒక జీఎస్టీ విషయంలోనే కాదు అనేక విషయాల్లో బొత్స తీరుతూ ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడాల్సి వస్తుందని టాక్ నడుస్తుందట. డీఎస్పీతో ఒకటి చెప్తారు. బయటకి ఇంకోటి మాట్లాడతారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఒకటి చెప్తే బొత్స మరొకటి చేస్తున్నారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారట. అసెంబ్లీ సెషన్స్ మొదలైన తొలి ఐదు రోజుల కాలంలో మండల్లో బొత్స వ్యవహరించిన తీరుతో ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెరిగిందే కానీ వైసీపీ మైలేజ్ తగ్గిందంటూ ఎమ్‌ఎల్సీలు ఆందోళన చెందుతున్నారట. మండలిలో గాని.. బయట గాని ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మొత్తం బొత్స తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారని అటువంటప్పుడు ఇంకా తాము ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్సీలు. మండలిలో ప్రభుత్వ కూటమి కన్నా ప్రతిపక్షానికే ఎక్కువ బలం ఉంది. దీంతో శాసన సభకు వైసీపీ డీకొడుతూ ఉన్న మండలి సమావేశాలు అంతో ఇంతో సజావుగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంశాలపై చర్చల్లో భాగంగా కొన్నిటిని వ్యతిరేకించడం మరికొన్నిటిని వాకౌట్ ద్వారా బహిష్కరిస్తున్నట్లు వైసీపీ సభ్యులు ప్రకటిస్తున్నారు. దీంతో పార్టీ స్థాన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అయిందని టాక్ నడుస్తుందట.
బొత్స తీరు జగన్‌ను అవమానించేలా ఉందని పార్టీలో చర్చ
కేంద్ర ప్రభుత్వ విషయంలో జగన్ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డిఏ అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలపై జగన్ నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా మారాయనే టాక్ ఇంటర్నల్‌గా నడుస్తోంది. ఆక్రమంలో బొత్స వ్యవహారం వైసీపీలో అనేక రకాల చర్చలకు కారణం అవుతుంది. ఆయన ఇటీవల తీరు జగన్‌ను అవమానించేలా ఉందని అనుకుంటున్నారు. ఇటీవల శర్మిలతో ఆత్మీయంగా ముచ్చట్లు రఘురామ వంటి వారితో కలవడం జగన్‌కు కొత్త అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయట.
Also Read: ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
గత అసెంబ్లీ సమావేశాల్లోనూ బొత్స తీరుపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పవన్‌కు బొత్సా కరచాలనం చేయడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సంఘటనపై బొత్సా వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి శాసన మండలిలో తగినంత బలం ఉన్న ప్రభుత్వాన్ని కనీసం ఇబ్బంది పెట్టలేకపోతున్నారు అని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో మండలిలోని బొత్స వ్యవహారం ఏ మలపు తిరుగుతుందో.