BigTV English

Bigg Boss 9 Promo: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా?

Bigg Boss 9 Promo: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా?

Bigg Boss 9 Promo:దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లో దసరా పండుగ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఒకవైపు దసరా సెలబ్రేషన్స్ తో పాటు మరొకవైపు బతుకమ్మ పండుగను కూడా హౌస్ మేట్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా 21వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ఇక వారికి తెలిసేలా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు మరి ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపెట్టిన దివ్య నిఖిత..

తాజాగా ప్రోమో విడుదల చేయగా.. ప్రోమోలో మిరాయ్ బ్యూటీ రితిక నాయక్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలి అంటే హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయట పెట్టాలి అని అడుగుతాడు. ఇక వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కామనర్ దివ్య నిఖిత ముందుకు వచ్చి.. రీతూ ఒకసారి ముందుకు రావా అంటూ పిలిచింది. దివ్య మాట్లాడుతూ..” రీతూ ఇంకా కళ్యాణ్ వీరిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. దీంతో వీరి మధ్య ఏదో బాండ్ ఉంది అనుకున్నాను. అనుకునే లోపే మళ్ళీ.. రీతూ, పవన్ దగ్గర అయ్యే గ్యాప్ లో… కళ్యాణ్ తనూజాకి దగ్గర అవుదాం అనుకున్నాడు. తనూజ కళ్యాణ్ కి అంత స్కోప్ ఇవ్వలేదేమో.. సో కళ్యాణ్ మళ్లీ రీతు దగ్గరకే వచ్చేసాడు. ఇలా ఈ ముగ్గురు ట్రయాంగిల్ లో మిగిలిపోయారు, అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయట పెట్టింది . కనీసం ఇప్పటికైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీరు తమ గేమ్ పై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ALSO READ:Tripti dimri: అతని వల్ల నా లైఫ్ 360° తిరుగుతోంది..నటి ఎమోషనల్ కామెంట్స్!

కంటెస్టెంట్స్ తో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకున్న తెలుసుకదా మూవీ టీం..

ఇకపోతే తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సిద్దు జొన్నలగడ్డ, వైవాహర్ష, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి బిగ్బాస్ హౌస్ కి రాగా వారితో మాట్లాడుతూ.. మీ నలుగురు హౌస్ లో ఉండాల్సి వస్తే ఎన్ని రోజులు ఉంటారు? అని ప్రశ్నించగా.. నేను ఉండిపోతాను సార్ అంటూ సిద్దు చెబుతాడు. దీంతో రీతు అయితే రండి లోపలికి అంటూ అడుగుతుంది. సిద్దు మాట్లాడుతూ అంటే కొంచెం సినిమా రిలీజ్ ఉందమ్మా అని చెప్పగా.. నాగార్జున మాట్లాడుతూ రీతు ఏదైనా అడిగితే నేను కాదనలేను అంటూ నాగార్జున వారిని హౌస్ లోకి పంపించేశారు. దీంతో నలుగురు హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ తో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.

కంటెస్టెంట్స్ ను మార్చే ప్రయత్నం చేసిన హోస్ట్..

ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటిసారి. మీకున్న ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు తెప్పించి.. మీ ఆట తీరు మార్చడానికి చేసే ప్రయత్నం ఇది అంటూ చెబుతాడు. ఇంక రీతు చౌదరిని ప్రశ్నిస్తూ మీరు మీ గేమ్ కంటే డిమాండ్ పవన్ కోసమే ఆడుతున్నట్టు అనిపిస్తోంది అని అభిమానులు అడిగినట్లుగా నాగార్జున ప్రశ్నించారు. దీనికి రీతు మాట్లాడుతూ నా గేమ్ నేను ఆడుతున్నాను కానీ పవన్ తో ఫ్రెండ్ షిప్ఉంది అని రీతు చెప్పగా .. ఆడియన్స్ మాత్రం రీతు చెప్పేది నిజం కాదు అని కామెంట్ చేశారు. మొత్తానికి అయితే ఈ ప్రోమో ఇప్పుడు బాగా ఆకట్టుకుంటోంది.

Related News

Bigg Boss 9 Promo: దసరా జాతర.. సందడి చేసిన మూవీ యూనిట్స్!

Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!

Bigg Boss 9 : ఫ్యూజ్ లు ఎగిరిపోయే వార్నింగ్ లు, సరికొత్త టాస్కులు, మరికొన్ని ట్విస్టులు 

Bigg Boss 9: కంటెస్టెంట్స్ కి రియల్ అగ్ని పరీక్ష.. సంజన కోసం ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. తనూజ కాఫీ.. త్యాగం

Bigg Boss 9 : ఇది అసలైన రణరంగం,సుమన్ శెట్టి మీద ఒపీనియన్ పోతుంది

Bigg Boss 9: కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్, ఒక మెట్టు ఎక్కేసావయ్యా ఇమ్మానియేల్

Bigg Boss 9 Promo: అంత చీప్‌గా కనిపిస్తున్నానా.. ఇలాంటి మనిషితో ఉండలేం.. హరీష్‌, రాముని కడిగిపారేసిన సంజన!

Big Stories

×