Janulyri -Deelip Devagan: జానులిరి(Janulyri) పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ ఫోక్ డాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జాను ఢీ డాన్స్ షో(Dhee Dance Show)లో విన్నర్ గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ఈమె ఎన్నో ఆల్బమ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈమె కెరియర్ విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే జాను తరుచు తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన జాను తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా తన భర్త నుంచి విడిపోయిన ఈమె ఒంటరిగా తన కొడుకు బాగోగులను చూసుకుంటూ కెరియర్ పై దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే జాను ఇటీవల తాను ప్రేమలో పడ్డానని రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఇక ఈమె ప్రేమించింది మరెవరినో కాదు మరొక ఫోక్ డాన్సర్ దిలీప్ దేవగన్ (Deelip Devagan)అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని వెల్లడించడంతో ఈ వార్తలు కాస్త వైరల్ అయ్యాయి. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ భావిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ బ్రేకప్ (Break Up)చెప్పుకున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఇటీవల జాను సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తుంటే ఇద్దరు మధ్య ఏదో జరిగిందని స్పష్టం అవుతుంది. తాజాగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో తనూజ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో అక్కటి నుంచి కూడా అంతే ప్రేమ వచ్చినప్పుడే ఆ రిలేషన్ కొనసాగించాలి లేదంటే లేదు అనేది 100% కరెక్ట్ అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మరో వైపు దిలీప్ సైతం “మరోసారి నేను ప్రేమలో మోసపోయానని” పోస్ట్ చేశారు. అదేవిధంగా ఈయన “జీవితంలో నేను నిన్ను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదు కానీ నేను చేసిన తప్పు ఏంటో తెలుసా.. నీలాంటి దాన్ని ప్రేమించడం” అంటూ మాట్లాడిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది.
ఇలా వీరిద్దరి ఇంస్టాగ్రామ్ పోస్టులు చూస్తుంటే మాత్రం ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని స్పష్టం అవుతుంది అయితే ఇప్పటికీ దిలీప్ జానును ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నప్పటికీ జాను మాత్రం దిలీప్ ని అన్ ఫాలో చేయడం జరిగింది. ఇలా వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయో తెలియదు కానీ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక్కటవుతారనుకున్న ఈ జంట ఇలా బ్రేకప్ చెప్పుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే జాను లిరి ఇదివరకే మరొక ఫోక్ డాన్సర్ టోనీ కిక్ (Tony kick)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి బాబు పుట్టిన తర్వాత వ్యక్తిగత కారణాలవల్లే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక దిలీప్ ప్రేమలో ఉన్న జాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఈ బ్రేకప్ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.