Rain Alert: భారత వాతావరణ శాఖ (IMD) దక్షిణ భారత రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. రేపు అనగా, అక్టోబర్ 21, 2025న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక తీరం, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాల తీవ్రత ఊహించని విధంగా పెరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థ తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలను బలంగా ప్రభావితం చేస్తోంది, దీని ఫలితంగా నిరంతర వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, నదులు, చెరువులు, డ్యామ్‌లలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది.
IMD ప్రకారం, అక్టోబర్ 21న తీవ్ర వర్షపాతం సంభవించనుంది. కొన్ని ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే కుండపోత వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడవచ్చని పేర్కొంది. ఈ వర్షాలు రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయం వంటి సమస్యలను సృష్టించవచ్చు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. పనులను రోడ్డు ప్రయాణాలను వాయిదా వేయాలని సూచించారు.
Also Read: Night Food Habits: రాత్రి పూట పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా?
లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలి, వాహనాలను ఎత్తైన చోట పార్క్ చేయాలని తెలిపింది. స్థానిక అధికారులు, IMD ఎప్పటికప్పుడు జారీ చేసే అప్‌డేట్‌లను కచ్చితంగా అనుసరించాలని వెల్లడించింది. వర్షాలు, ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, ప్రజలు పవర్ బ్యాంకులు, టార్చ్‌లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలి, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేసింది
రైతులు పంటల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. నీటి పారుదల వ్యవస్థలను ముందుగానే సరిచేయడం, నష్టం జరిగే పంటల వివరాలను అధికారులకు తెలియజేయడం, వారి సూచనల మేరకు సమన్వయం చేసుకోవడం ముఖ్యమని తెలిపింది.ముగింపుగా, అక్టోబర్ 21 నుంచి వర్షాలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి ప్రజలు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలని తెలిపింది.