Ajmal Ameer: అజ్మల్ అమీర్(Ajmal Ameer) మలయాళ నటుడిగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించిన అజ్మల్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఈయన సోషల్ మీడియా వార్తలలో నిలవడానికి కారణం లేకపోలేదు. అజ్మత్ అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడాడు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలా అమ్మాయిలతో సె** చాటింగ్ చేస్తున్నారంటూ ఈయనపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తన గురించి సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై స్వయంగా నటుడు అజ్మల్ అమీర్ స్పందించారు. ఈ సందర్భంగా అజ్మల్ స్పందిస్తూ నేను అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడానని అలాగే అసభ్యకర చాట్టింగ్ చేశాను అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈయన తెలియజేశారు. నా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (AI Technology) సహాయంతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అని తెలిపారు. ఇలా ఏ ఐ ద్వారా రూపొందించిన వీడియోలు ఎడిటింగ్ అలాగే వాయిస్ ఇమిటేటింగ్ నా కెరియర్ పై ఏమాత్రం ప్రభావం చూపలేవని.
ఆ దేవుడి దయవల్ల తనకు తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది నేనేంటో వారికి తెలుసు. ఇలా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నాపట్ల ఈ విధమైనటువంటి తప్పుడు వీడియోలను వైరల్ చేస్తూ నన్ను తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక ఈ వివాదంలో తాను చిక్కుకున్నప్పటికీ నా ఇమేజ్ కాపాడటానికి అందరిలాగా నాకంటూ ప్రత్యేకంగా ఒక మేనేజర్ గాని పిఆర్ టీమ్ కానీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అజ్మల్ తెలిపారు.
ఫేక్ ఫోటోలు.. వీడియోలు..
ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఫేక్ ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .అయితే ఇదంతా కూడా కొందరు ఉద్దేశపూర్వకంగానే ఏఐ సహాయంతో క్రియేట్ చేసినవని స్పష్టం అవుతుంది. ఇలా కొందరి అత్యుత్సాహం కారణంగా సెలబ్రిటీలు ఇబ్బందులలో పడుతున్నారు.. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలా టెక్నాలజీ అభివృద్ధి చెందిందని సంతోషపడాలో లేక టెక్నాలజీని చెడుగా ఉపయోగిస్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. టెక్నాలజీ వచ్చిన తర్వాత నిజం ఏదో అబద్ధం ఏదో కూడా తెలియని పరిస్థితులు తలెత్తాయి. ఎఐ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీలు మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Chiranjeevi: మెగా ఇంట దీపావళి.. ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్..ఫోటోలు వైరల్!