Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీ లీలా (Sreeleela)ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు సినిమా ప్రమోషన్లలో కూడా బిజీగా ఉంటున్నారు. కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉంటున్నారు. తాజాగా శ్రీ లీల రవితేజ(Raviteja)తో కలిసిన మాస్ జాతర (Mass Jathara)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు.
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో శ్రీ లీల వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు .ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ శ్రీ లీల జంటగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా శ్రీ లీల ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.
ఉస్తాద్ సినిమా గురించి చెప్పాలి అంటే నాకు ఒక రోజు మొత్తం అసలు సరిపోదని వెల్లడించారు.ఈ సినిమా పవర్ ప్యాకెడ్ సినిమా, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది అంటూ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ అప్డేట్ తెలియజేస్తూ ఇందులో నా పాత్రకు సంబంధించి కొంచెం ప్యాచ్ వర్క్ ఉందని, మిగతా షూటింగ్ మొత్తం పూర్తి అయిందని శ్రీ లీల ఈ సినిమా షూటింగ్ అప్డేట్ తెలియజేశారు.. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి మేకర్స్ ఎలాంటి అప్డేట్ తెలియచేయకపోయినా శ్రీ లీల మాత్రం ఈ సినిమా షూటింగ్ గురించి వెల్లడించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్..
ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీ లీల కూడా ఈ సినిమాలో రేడియో జాకీగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాతలు వెల్లడించారు.
Also Read: Ajmal Ameer: సె** ఆడియో చాట్ పై స్పందించిన నటుడు.. నన్నేం చేయలేవంటూ కామెంట్స్!