BigTV English

Water Car: నీటితో నడిచే కారు, ఇరాన్ శాస్త్రవేత్త అద్భుత సృష్టి!

Water Car:  నీటితో నడిచే కారు, ఇరాన్ శాస్త్రవేత్త అద్భుత సృష్టి!
Advertisement

Water Fueled Car:

కార్లు దేనితో నడుస్తాయంటే వెంటనే పెట్రోల్ లేదంటే డీజిల్ అని చెప్తారు. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇప్పుడ కొత్త ఇంధనంతో నడిచే కారు రాబోతోంది. అదే, వాటర్ ఫ్యూయెల్ కారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇరాన్ కు చెందిన శాస్త్రవేత్త అలావుద్దీన్ కసేమి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇందులో ఉన్న ఓ కారు పెట్రోల్, డీజిల్‌ తో కాకుండా పూర్తిగా నీటితో నడుస్తుందని చూపించారు. ఈ వైరల్ ఫుటేజ్ లో కసేమి ఓ వాటర్ పైపును పట్టుకుని ఉంటాడు. ఈ పైపులో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ తో కారు ట్యాంక్ ను నింపుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. ఈ కారు ఇంజిన్ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించి, వాహనం నడిచేలా శక్తిని అందిస్తుందని అలావుద్దీన్ వివరించారు.


60 లీటర్ల వాటర్ తో 900 కిలో మీటర్ల ప్రయాణం

కసేమి ప్రకారం.. ఈ కారు ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు ఉంటుంది. ఒక్కసారి ఫుట్ ట్యాంక్ చేస్తే, ఏకంగా 900 కిలోమీటర్ల దూరం లేదంటే సుమారు 10 గంటల డ్రైవింగ్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ కారు ఎటువంటి కాలుష్యాన్ని విడుదల చేయదని, నీటి ఆవిరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నారు. పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని ఆయన వెల్లడించారు.

సాధ్యాసాధ్యాలపై నిపుణులు సందేహాలు

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పరిశోధకులు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌ గా విభజించడం అత్యంత ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రక్రియ అంటున్నారు.  వాస్తవానికి, దీనికి ఉత్పత్తి చేసే దానికంటే ఎక్కువ శక్తి అవసరం అంటున్నారు. కసేమి చెప్పిన విధానం థర్మోడైనమిక్స్  ప్రాథమిక నియమాలను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అయిన తర్వాతే తమకు ఓ క్లారిటీ వస్తుందని ఆటోమోబైల్ టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఓవైపు ప్రశంసలు మరోవైపు అనుమానాలు!

ఇక ఈ కారు వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఈ ఆవిష్కరణను విప్లవాత్మకంగా ప్రశంసించగా, మరికొందరు దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు.  “దేవుడు అతడిని రక్షించాలి” అని ఓ వ్యక్తి కామెంట్ చేస్తే, మరొకరు “ఈ మనిషి త్వరలో అదృశ్యం అవుతాడు” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు.

నీటితో నడిచే వాహనం గురించి చెప్పడం ఇందే కొత్తకాదు!  

నీటితో నడిచే వాహనం గురించి చెప్పుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో,  ఓ ఇండియన్ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ లో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో అతడు నీటిని ఉపయోగించి మోటార్‌ సైకిల్‌ కు పవర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ క్లిప్‌లో అతడు బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌ లోకి నీళ్లు పోస్తాడు. ముందు కొద్ది ఫెయిల్ అయినా, ఆ తర్వాత దాన్ని స్టార్ట్ చేసి కొద్దిసేపు నడపగలుగుతాడు. అయితే, ఇప్పట్లో ఈ వీడియో వైరల్ అయినా, దీని విశ్వసనీయత మీద పెద్ద చర్చ జరిగింది.  ఇంతకీ కసేమీ కారులో వాస్తవం ఎంత అనేది త్వరలో తెలియనుంది.

Read Also:  జ్వరంతో చనిపోయిన ఎయిర్ హోస్టెస్.. లీవ్ లెటర్ అడిగిన విమాన సంస్థ.. నెటిజన్లు ఆగ్రహం!

Related News

Nokia Kuxury 5G: నోకియా ఇన్ఫినిటీ ప్రో మాక్స్ 5జి లాంచ్.. భారతదేశంలో ధర ఎంతంటే..

iPhone16 Flipkart Offer: లాస్ట్ ఛాన్స్.. ఐఫోన్ 16 రూ.35,000 లోపే ఫ్లిప్‌కార్ట్ లాస్ట్‌మినిట్ సేల్ ధమాకా..

Oppo F29 Pro Plus 5G: 200ఎంపి కెమెరా, 7100mAh బ్యాటరీ.. ఒప్పో ఎఫ్29 ప్రో ప్లస్ 5జి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు లీక్

Samsung Galaxy M35: 200ఎంపి కెమెరా, 6000mAh బ్యాటరీ.. ఫ్లాగ్‌షిప్ అనుభూతినిచ్చే గెలాక్సీ ఎం35 5జీ ఫీచర్లు అదుర్స్

Vivo Smartphone: 4870mAh బ్యాటరీ.. Vivo X90 Pro 5G ఫుల్ రివ్యూ

Poco 108 MP Cameraphone: రూ.10000 కంటే తక్కువ ధరలో 108MP కెమెరాగల పోకో ఫోన్.. ఈఎంఐ కేవలం రూ.352

Foldable Discount: 12GB ర్యామ్, 32MP సెల్ఫీ కెమెరాగల ఫోల్డెబుల్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.20000 డిస్కౌంట్

Big Stories

×