Poco M6 Plus Discount | తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించే పోకో బ్రాండ్ ఫోన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్రాండ్ కు చెందిన పోకో M6 ప్లస్ 5G ఫోన్ ఇప్పుడు బెస్ట్ డీల్ లభిస్తోంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.13,499గా ఉండగా, ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో కేవలం రూ.9,999కే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో లభిస్తోంది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ 5G ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఆలస్యం చేయకండి!
పోకో M6 ప్లస్ ఫోన్ డీల్ చాలా ప్రత్యేకం. దీని ధర, ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ అనేక కొనుగోలుపై 5 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. అంతేకాక, కేవలం రూ.352 నుండి EMI ఆప్షన్‌తో కొనుగోలు ప్రారంభించవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్‌తో మీ పాత ఫోన్ ఆధారంగా మరింత తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్ బట్టి ఎక్స్చేంజ్ విలువ నిర్ణయించబడుతుంది.
పోకో ఎం6 ప్లస్ 5Gలో 6.79 ఇంచ్‌ల పెద్ద డిస్‌ప్లే ఉంది. ఇది ఫుల్ HD+ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది, దీనివల్ల స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ డిస్‌ప్లే 550 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను చేరుకుంటుంది ఫోన్‌పై గొరిల్లా గ్లాస్ 3తో స్క్రాచ్‌ల నుండి రక్షణ పొందుతుంది.
ఈ ఫోన్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE ప్రాసెసర్ ఉంది, ఇది 5G కనెక్టివిటీ, లైట్ టాస్క్‌లకు అనువైనది. 8GB RAMతో మల్టీటాస్కింగ్ సులభం అవుతుంది. అలాగే, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో యాప్‌లు, ఫోటోల కోసం తగినంత స్థలం లభిస్తుంది.
ఈ ఫోన్‌లో కెమెరా ప్రధాన ఆకర్షణ. 108MP ప్రైమరీ సెన్సార్ సూక్ష్మ డీటైల్స్‌తో ఫోటోలను తీస్తుంది. వెనుకవైపు 2MP డెప్త్ కెమెరా ఉంది, ఇది ఫోటోలకు అందమైన బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్‌ను జోడిస్తుంది. 13MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు స్పష్టంగా, రంగులతో కూడినవిగా ఉంటాయి.
ఈ ఫోన్‌లో 5030mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది ఒక్కసారి ఛార్జ్‌తో రోజంతా పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ భద్రతను అందిస్తుంది. అలాగే, IP53 రేటింగ్‌తో ఈ ఫోన్ దుమ్ము, నీరు నుంచి రక్షనిస్తుంది.
పోకో ఎం6 ప్లస్ 5G చాలా సరసమైన ధరలో 108MP కెమెరా, 5G కనెక్టివిటీ కలిగిన గొప్ప ఆప్షన్. ఈ దీపావళి సేల్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను మిస్ చేయలేని డీల్. మరి కొన్ని రోజులు మాత్రమే ఈ పరిమిత-కాల ఆఫర్‌ను మీరు మిస్ చేసుకోవద్దు. ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పుడే ఈ ఫోన్ కోసం ఆర్డర్ చేయండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే