BigTV English

Govardhan Asrani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Govardhan Asrani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!
Advertisement

Govardhan Asrani: దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు ఎంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు వరుసగా మరణిస్తున్న తరుణంలో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పంకజ్ ధీర్ (Pankaj Dheer)అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త మర్చిపోకముందే మరొక నటుడు గోవర్ధన్ అశ్రాని (84)(Govardhan Asrani) కన్నుమూశారు. తాజాగా ఈయన మరణ వార్త గురించి అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయన మరణం పట్ల నివాళులర్పిస్తున్నారు.


వృద్ధాప్య సమస్యలతో మరణం..

గోవర్ధన్ అస్రాని వయసు పైబడటంతో గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా అనారోగ్య సమస్యల కారణంగా ఈయన మరణించారని తెలుస్తోంది. ఇక ఈయన మరణ వార్త తెలిసిన పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఈయన మరణం పై స్పందిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే గోవర్ధన్ మరణానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియా వేదికగా అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ఇలా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన గోవర్ధన్ మరణ వార్తను వినాల్సి వస్తుందని ఎవరు ఊహించలేదు.

టెలివిజన్ రంగంలోనూ గుర్తింపు..

గోవర్ధన్ అస్రాని 70 లలో ఇండస్ట్రీలో నటుడిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడిపారు. ఇలా హాస్యనటుడిగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకున్న గోవర్ధన్ తన సినీ కెరియర్లో సుమారు 350 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. గోవర్ధన్ సినిమాల విషయానికి వస్తే మేరే అప్నే, కోశిష్, బావర్చి పరిచయ్ , అభిమాన్, చుప్కే చుప్కే చోటికి బాత్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.


దర్శకుడిగా సక్సెస్..

దూరదర్శన్ 1985 సీరియల్ నట్‌ఖట్ నారద్‌లో నారద పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా తన నటనతో మెప్పించారు. ఇక ఈయన సింగర్ గా పలు పాటలను కూడా ఆలపించారు అదే విధంగా దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో కొనసాగారు. అస్రాని బన్నే అనే సినిమాకు దర్శకత్వం వహించి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలయి పెద్ద ఎత్తున ప్రశంసలను కూడా అందుకుంది. ఇలా కొన్ని దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీకి అద్భుతమైన సేవలను అందించిన గోవర్ధన్ అస్రాని మరణ వార్త ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పాలి.

Also Read: Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్ ఇచ్చిన శ్రీలీల..పవర్ ప్యాకెడ్ అంటూ!

Related News

Siddu Jonnalagadda: పది సంవత్సరాల తర్వాత మేమే తోపులం, నవీన్ పోలిశెట్టి, శేష్ లపై సిద్దు ఆసక్తికర కామెంట్

NTR: ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం, ఇదెక్కడి డెసిషన్ తారక్?

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్ ఇచ్చిన శ్రీలీల..పవర్ ప్యాకెడ్ అంటూ!

Ajmal Ameer: సె** ఆడియో చాట్ పై స్పందించిన నటుడు.. నన్నేం చేయలేవంటూ కామెంట్స్!

Chiranjeevi: మెగా ఇంట దీపావళి.. ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్..ఫోటోలు వైరల్!

Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?

Mari Selvaraj: నేను నీకు మద్యం ఇవ్వడం లేదు, నా సినిమా అలా చూడకు

Big Stories

×