Shahid Afridi: టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పరువు తీసే ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… అనవసరంగా రోహిత్ శర్మను గెలిచేశాడు షాహిద్ ఆఫ్రిది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో… మొదటి వన్డేలో రోహిత్ శర్మ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించారు. పసికూన జింబాబ్వే లాంటి జట్లపైన మాత్రమే రోహిత్ శర్మ సెంచరీలు చేస్తాడని… ఆస్ట్రేలియా లాంటి బడా జట్లపై తోక ముడుస్తాడు అంటూ కారు కూత కూసాడు షాహిద్ ఆఫ్రిది. దీంతో అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకేముంది షాహిద్ ఆఫ్రిది ఈ వ్యాఖ్యలు చేయగానే రోహిత్ శర్మ అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో నిన్న తొలి వన్డే మ్యాచ్ జరగగా టీమిండియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీతో పాటు ఇతర టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుచిత్తుగా టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే దాదాపు ఏడాది తర్వాత వన్డే జెర్సీ ధరించిన రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇది అదునుగా చూసుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా స్పందించారు. ఇలాంటి వాళ్లను జట్టులోంచి తీసేయాలని డిమాండ్ చేశారు.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
పసికూన లాంటి వీక్ జట్లపైన మాత్రమే రోహిత్ శర్మ సెంచరీల మీద సెంచరీలు చేస్తాడని ఫైర్ అయ్యారు. కానీ ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లపైన ఏమాత్రం ఆడబోడని వివరించారు. ఒకవేళ నేను టీమిండియా హెడ్ కోచ్ అయితే కచ్చితంగా రోహిత్ శర్మను టీమిండియా నుంచి తొలగించే వాడిని అంటూ బాంబు పేల్చారు. ఒక్క సిరీస్ కాదు రెండు సీరియస్ కాదు దాదాపు రెండు సంవత్సరాలు జట్టులోంచి తొలగించే వాడినని షాహిద్ అఫ్రిది రెచ్చిపోయారు. అయితే దీనిపై టీమిండియా అభిమానులు, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోహిత్ శర్మ అద్భుతమైన ప్లేయర్ అంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు మీ పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.. మొదట మీ జట్టును సెట్ చేయ పో అంటూ షాహిద్ అఫ్రిదికు కౌంటర్ ఇస్తున్నారు.