BigTV English

Mobile Offers: తస్సాదియ్యా.. మొన్ననే లాంచ్ అయిన కొత్త 5జీ ఫోన్.. ఇప్పుడు రూ.10 వేల లోపే కొనేయొచ్చు..

Mobile Offers: తస్సాదియ్యా.. మొన్ననే లాంచ్ అయిన కొత్త 5జీ ఫోన్.. ఇప్పుడు రూ.10 వేల లోపే కొనేయొచ్చు..

IQOO Z9 Lite 5G offers: iQoo మొబైల్ బ్రాండ్ తరచూ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల తన లైనప్‌లో ఉన్న Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ IQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ సేల్‌కి అందుబాటులోకి వచ్చింది. ఈ తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD + LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనితో పాటు కంపెనీ ఈ ఫోన్‌లో 2 సంవత్సరాల వరకు Android అప్‌గ్రేడ్, 3 సంవత్సరాల వరకు సేఫ్టీ అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది.


IQOO Z9 Lite 5G Specifications

IQOO Z9 Lite 5G ఫోన్‌లో 6.56 అంగుళాలు (1612 X 720 పిక్సెల్‌లు), 90Hz రిఫ్రెష్ రేట్, 840నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని కంపెనీ అందించింది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. Z9 లైట్ 5Gలో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్ ఆర్మ్ మాలి-G57 MC2 GPU ఉంది. ఈ ఫోన్‌లో స్టోరేజ్ విషయానికొస్తే.. దీనికి 4GB/ 6GB LPDDR4x RAM, 128GB eMMC 5.1 స్టోరేజ్ ఇవ్వబడింది. మైక్రో SD కార్డ్ సహాయంతో ఈ ఫోన్ స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. అలాగే IQOO Z9 Lite 5G ఫోన్ Android 14 ఆధారిత Funtouch 14 OS సిస్టమ్‌పై రన్ అవుతుంది.


Also Read: కేవలం రూ.20 వేలలోపే బెస్ట్ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్స్.. మీకు నచ్చినవి.. మీరు మెచ్చినవి..!

ఈ ఫోన్‌లో కంపెనీ డ్యూయల్ AI వెనుక కెమెరా సెటప్‌ను అందించింది. అందులో 50MP మెయిన్ లెన్స్, 2MP Bokeh సెన్సార్‌ వంటివి ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కంపెనీ IQOO Z9 Lite 5Gలో 5,000mAh శక్తివంతమైన బ్యాటరీని అందించింది. పూర్తి ఛార్జింగ్ తర్వాత ఈ ఫోన్ 9 గంటల వీక్షణను, 32 గంటల సోషల్ మీడియాను మరియు 84 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ కోసం Wi-Fi, GPS, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

IQOO Z9 Lite 5G Price

IQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం 4GB/ 128GB.. 6GB/ 128GB అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 4GB ర్యామ్/ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499గా ఉంది. అలాగే 6GB ర్యామ్/ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.11,499గా కంపెనీ నిర్ణయించింది. ఇది మాత్రమే కాకుండా ఈ రెండు వేరియంట్‌లపై రూ. 500 తక్షణ తగ్గింపు కూడా అందించబడుతోంది. అన్ని బ్యాంక్ కార్డులపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్ తర్వాత ఈ రెండు ఫోన్‌లు వరుసగా రూ.9,999, రూ. 10,999 ధరలకు అందుబాటులోకి వస్తాయి. కాగా ఈ IQOO Z9 Lite 5G ఫోన్‌ అమెజాన్‌‌లో అందుబాటులో ఉంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×